పేద విద్యార్థినికి సీతారత్నం ట్రస్టు చేయూత

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం నిరుపేద విద్యార్థినికి పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు చేయూతనందించింది. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న నిరుపేద విద్యార్థిని వేదగిరి జూహిత మురారి ఆర్థిక ఇబ్బందులతో కళాశాల ఫీజు చెల్లింపు భారంగా మారింది. జూహిత మురారి కుటుంబ సభ్యులు పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టును ఆశ్రయించి చేయూతని వ్వాలని కోరారు సానుకూలంగా స్పందించిన ట్రస్టు చైర్మన్ పరిశ పుల్లయ్య శనివారం జూహిత కళాశాల ఫీజు రూ 12 వేల చెక్కును కళాశాలలో అందజేశారు ఈ సందర్భంగా పరిశ పుల్లయ్య మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదన్నారు నిరుపేద విద్యార్థులకు పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking