వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ…?
ఆ సామాజిక వర్గాన్ని గుర్తిస్తారా
మూడు దఫాలుగా పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తి
జావేద్ అనుచరుల డిమాండ్
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల నుంచి పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు క్రియాశీలకంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకుని స్వంత ఖర్చులతో దగ్గరుండి చేపట్టిన ఎండి జావిద్ ఈసారి ఖమ్మం అసెంబ్లీ అసెంబ్లీ బరిలో ఉండాలని అనుకున్నారు కానీ అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ కట్టుబడి ఖమ్మం అసెంబ్లీ టేకెట్ వదులుకున్నారు అప్పుడు 2018లో ఉమ్మడి అభ్యర్థిగా నామా నాగేశ్వరావు అభ్యర్థికి సహకారం అందించారు ఇప్పుడు 2023 ఎన్నికల్లో తుమ్మల గెలుపుకు పూర్తిస్థాయి సహకారం అందించారు ఆనాటి నుంచి నియెూజకవర్గంలో నాయకులను కార్యకర్తలను పట్టించుకునే నాదుడే లేక స్తానిక సంస్థల ఎలక్షన్ లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకత్వం ఆర్దిక ఇబ్బందులు అదికార పార్టీ ఒత్తిల్లని తట్టుకుని నిలబడి న తరుణంలో ఖమ్మంలో కాంగ్రెస్ జెండా కిందపడనివ్వను మీకు నేను అండగా ఉంటానని పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు జెండాలిచ్చి మైకు పెట్టి లక్షలాది రూపాయలు వెచ్చించి మీటింగుల కి నాయకుల ను కార్యకర్తలను తరలించిన నాయకుడు మహమ్మద్ జావేద్ వరంగల్ డిక్లరేషన్,రాహుల్ గాంధీ బారత్ జోడో యాత్ర వంటి కార్యక్రమా లను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపట్టి ఖమ్మం ప్రజల మనసు గెలిచిన నాయకుడు మన జావేద్ ప్రజలు గుడి, బడి, చర్చీ, మసీదులు మరియు కుల దేవతల గుళ్ళ నిర్మాణాలకి తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి తన చేతనైనంత సహాయం చేసిన నాయకుడు జావేద్ మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ ని మెూసంచేసిన అభ్యర్థిని ఓడించాలంటే టికెట్ ఆశావహులు ముందుకు వచ్చి పార్టీ కష్టాల్లో ఉంది ఆర్దికంగా సహాయం చేయాలని పార్టీ అద్యక్షుల వారు పిలుపు నిస్తే మునుగోడు మండలంలో కొన్ని క్లస్టర్ ఇంచార్జ్ గా బాద్యతలు నిర్వహించారు కింది స్తాయి క్యాడర్ కి అందుబాటులో ఉండే నాయకుడు జావేద్ అందుకే మన గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పాటుపడు తున్న జావేద్ కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కార్యకర్తలు ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్య కోరుకుంటున్నారు