జె. మేరీ ఫ్లోరెన్స్‌ ఆధ్వర్యంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ లో సెమి క్రిస్మస్‌ వేడుకలు

మౌలాలి ప్రజాబలం ప్రతినిధి:పీపుల్‌ ఎంపవర్మెంట్‌ సొసైటీ ఫౌండర్‌ జె. మేరీ ఫ్లోరెన్స్‌ మరియు సొసైటీ కమిటీ మెంబెర్స్‌ ఆధ్వర్యంలో శనివారం అనగా 16-12-2023 నాడు హెచ్‌. బి. కాలనీ, మౌలాలిలోని రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ లో సెమి క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగినది. ఈ సెమి క్రిస్మస్‌ వేడుకలకి ముఖ్య అతిధులుగా కార్పొరేటర్‌ జె. ప్రభు దాస్‌ , పాస్టర్‌ కింగ్స్లే , నర్సింగ్‌ ఆఫీసర్‌ జి. మేరీ క్రిస్టియానా విచ్చేసినారు. ఈ సెమి క్రిస్మస్‌ లో భాగంగా చిన్నపిల్లల డాన్సులు, పాటలతో చాలా సందడి చేసారు. అలాగే వారికీ క్రిస్మస్‌ బహుమతులను ముఖ్య అతిధుల చేతుల మీదుగా పిల్లలకు అందచేశారు. అనంతరం క్రిస్మస్‌ కేక్‌ కటింగ్‌ చేసారు.ఈ ప్రోగ్రామ్‌ కి సహాయ సహకారాలు అందచేసిన వారు జగదీశ్‌, ఆగషటీన్‌,శైలజ, మేరీ క్రిస్టియానా, ఫిల్లిప్స్‌ గార్లకు సొసైటీ తరుపున మేరీ ఫ్లోరెన్స్‌ గారు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేసారు. అలాగే సొసైటీ కమిటీ మెంబెర్స్‌ ఫిల్లిప్స్‌,యూనిస్‌, నాగలక్ష్మి, స్వాతి, రామలక్ష్మి, పవిత్ర, వసంత, పద్మ, అందరు కూడా చాలా చురుకుగా ప్రోగ్రామ్‌ లో పాల్గొని విజయవంతం చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking