హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ,
మెదక్ మనోహరాబాద్ న్యూస్:-
తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కాలకల్ గ్రామ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం హరిహర సుతుడు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, నిజామాబాద్ రూరల్ బిజెపి ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు,
ప్రజా ప్రతినిధులు మొదలగువారు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురు స్వామి జగ్గా ప్రభాకర్ గౌడ్ చేత ఈ మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. కలశపూజ అయ్యప్ప భజన సంకీర్తనలు, 18 మెట్ల మహా పడిపూజ మంగళ హారతులు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి .మహా పడిపూజ కార్యక్రమానికి మనోహరాబాద్ మండలంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.