ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం అర్జీదారుల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘‘గ్రీవెన్స్ డే’’లో అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి తగు చర్యలకై అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సింగరేణి మండలం కొమ్ముగూడెంకు చెందిన ఎట్టి వీరన్న తాను కొమ్ముగూడెం ఎం.పి.పి స్కూల్‌లో మనఊరు`మనబడి క్రింద పనులు పూర్తి చేయడం జరిగిందని ఇందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఎం.ఓ.ఎంబి కో`ఆర్డినేటర్‌ను ఆదేశించారు. ఖమ్మం నగరం 29వ డివిజన్‌కు చెందిన నివాసులు తమ ప్రాంతంలో ఎఫ్‌సిఐ గోడౌన్ వద్ద గోళ్ళపాడు చానల్ కాలువ నిర్మించిన ప్రదేశం వద్ద మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వాటిపై కవర్లు వేయించి గుంతలు పూడ్పించగలరని సమర్పించిన దరఖాస్తును, 34వ డివిజన్‌కు బాపూజీ పార్కు సమీపంలో గల వి.దేవెందర్ తాము నీవాస సమీపంలో బొమ్మల తయారీలో వాడుతున్న రంగులు, రసాయనాలు, వెల్డింగ్‌ల వల్లన గాలి కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులకు గురికావడం జరుగుతుందని, అట్టి బొమ్మల తయారీని నిలుపుదల చేయించగలరని సమర్పించిన దరఖాస్తులను తగు చర్య నిమిత్తం నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామంకు చెందిన డి.రమాదేవి తన భర్త దొంతగాని కృష్ణయ్య కరోనాతో అక్టోబరు,2021లో చనిపోయినారని, ప్రభుత్వం నుండి అందే ఆర్ధిక సహాయం ఇప్పించగలరని సమర్పించిన తగు చర్య నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. ముదిగొండ మండలం మాధాపురం గ్రామంకు చెందిన పడిశాల విజయ తాను 2019 సంవత్సరంలో ట్యాక్సీ కారుకొనుగోలు చేయడం జరిగిందని, తనకు పరిశ్రమల శాఖ నుండి రాయితీ మంజూరు కావడం జరిగినదని, కాని ఇంతవరకు తన ఖాతాలో జమకాలేదని అట్టి రాయితీసొమ్మును ఇప్పించగలరసి సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం పరిశ్రమల శాఖ అధికారికి సూచించారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంకు చెందిన జి.నాగేశ్వరరావు తనకు 2020`21 సంవత్సరంలో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా లోన్ మంజూరు కావడం జరిగినదని, కాని ఇంతవరకు తన ఖాతాలో నిధులు జమచేయబడలేదని అట్టి రుణం నిధులు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. సింగరేణి మండలం నానునగర్ తండాకు చెందిన పి.జ్యోతి తనకు ఆర్.ఓ.ఎఫ్‌ఆర్ పట్టా సర్వే అయినదని, పాస్ బుక్ కూడా రావడం జరిగినదని, కాని లిస్టులొ తన పేరు లేదని ఎంపిడి.ఓ తనకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఇవ్వడం లేదని తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ నిమిత్తం జిల్లా గిరిజనాభివృద్ధి అధికారికి సూచించారు. మధిర పట్టణం రామాలయం రోడ్డుకు చెందిన మప్పవరపు రామగోపాలరావు తాను సెప్టెంబరు 2, 2023 తేదీన నోడ్యూ సర్పిఫికేట్ తీసుకొని ఎస్‌బిఐ బ్యాంకు పంట ఋణం కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగినదని, తనకు టూవీలర్ లోన్ డిఫాల్ట్ చూపుతున్నదని పంట ఋణం ఇవ్వమని దరఖాస్తు తిరస్కరించారని, తాను టూవీలర్ లోను 2015లోనే క్లియర్ చేయడం జరిగినదని అయినప్పటికి ఆకారణంగా పంటఋణాన్ని తిరస్కరించారని విచరణ చేసి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును లీడ్‌బ్యాంక్ డిస్ట్రీక్ మేనేజర్‌కు సూచించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా అధికారులు తదితరులు గ్రీవెన్స్ డేలో పాల్గొన్నారు