రాష్ట్ర కమిటీ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తుమ్మల యుగేందర్ కు వినతిపత్రం

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డా.తుమ్మల యుగేందర్ ని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ మరియు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు . ప్రైవేట్ కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో పని చేస్తున్నటువంటి ప్రతి టీచింగ్ స్టాఫ్ మెంబర్ కి ప్రభుత్వము గుర్తింపు కార్డులను ఇవ్వాలని , వారి సర్వీస్ ను కూడా పరినణలోకి తీసుకోవాలి , ప్రతి టీచింగ్ స్టాఫ్ మెంబర్‌కి 10 లక్షల వరకు ప్రభుత్వము హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని , ప్రతి టీచింగ్ స్టాఫ్ మెంబర్‌కి కనీస వేతనాన్ని అమలు చేయాలని , పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి . ప్రైవేట్ కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో పని చేస్తున్నటువంటి అధ్యాపకుల పిల్లలకు ప్రైవేటు స్కూల్లో , కాలేజీల్లో 50శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని , అర్హులైన ప్రతి అధ్యాపకునికి ఇంటి స్థలంతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని , రాష్ట్రంలో 7లక్షల 50వేల మంది ఉన్న ప్రైవేటు, గెస్ట్ అధ్యాపకుల కొరకు ఆపత్కాల పరిస్థితులు ఏర్పడినప్పుడు వారి సంక్షేమం కొరకు 500 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు . తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ 2006 లో ప్రారంభించిన నాటి నుండి అధ్యాపకుల సమస్యలు గత పాలకులకు తెలియజేశాము , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మేమందరము కీలకపాత్ర పోషించాము . రాష్ట్ర ఏర్పాటు తరువాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రసమితి ప్రభుత్వ ఏర్పాటుకు మావంతు కృషి చేసి అండగా నిలిచాము . తెలంగాణ రాష్ట్ర సమితి మేము అనుకున్న విధంగా మా యొక్క సమస్యలను తీర్చలేకపోయిందని అన్నారు . ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ రావాడానికి మావంతు కృషిగా ఐకమత్యంగా మా అసోసియేషన్ తరుపున మద్దతు తెలిపాము . ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మిస్తారని మా ప్రగాఢ నమ్మకం అందులో భాగంగా ప్రజల కలలని సాకారం చేస్తూ అందులో భాగమైన మా అసోసియేషన్‌కి కూడా సహకరిస్తారని నమ్ముతూ మా యొక్క విన్నపాలు విన్నవించుకోవడం జరిగిందని పేర్కొన్నారు . ఈ సందర్బంగా డా. తుమ్మల యుగేందర్ మాట్లాడుతూ తప్పకుండా ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ మరియు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పర్సా రమేష్ గౌడ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తికొండ శ్రీనివాస్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు సిహెచ్ ప్రభాకర్ రావు , ఉమ్మడి ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయల వెంకట్ , జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ జిట్టబోయిన మల్లేష్ , జనరల్ సెక్రటరీ కోసూరి శ్రీనివాస్ గౌడ్ , ఫైనాన్స్ సెక్రటరీ పివిఎన్డి ప్రమోద్ కుమార్ , జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగన్ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking