ఖమ్మం ప్రతినిధి మే 22 (ప్రజాబలం) ఖమ్మం ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో ధరణీ దరఖాస్తుల పరిష్కారం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరణి పెండింగ్ దరఖాస్తులను నెలాఖరు లోగా పరిష్కరించాలన్నారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. ప్రతిరోజు తహసీల్దార్ కనీసం 25 ఫైళ్లు సమర్పించాలన్నారు. రిజిస్ట్రేషన్ లలో పెండింగ్ స్లాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, ఖమ్మం, కల్లూరు ఆర్డిఓ లు జి. గణేష్, ఎల్. రాజేంద్ర గౌడ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.