ఖమ్మం ప్రతినిధి మే 23 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నేకల్ వద్దగల కిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూoను కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గురువారం పరిశీలించారు. సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. రఘురాం రెడ్డి వెంట రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ప్రధాన ఎలక్షన్ ఏజెంట్ తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకులు కొప్పుల చంద్రశేఖర రావు, నరాల నరేష్ ఉన్నారు