ఖమ్మం ప్రతినిధి జనవరి 8 (ప్రజాబలం) ఖమ్మం పరిష్కార స్వభావం కలిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్ డే’’లో పలు సమస్యలకు సంబంధించి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి తగు చర్యలకై సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంకు చెందిన గుడిమెట్ల కన్యాకుమారికి సర్వేనెం.178/యులో 0.0650 ఎకరాలు మిస్సింగ్ సర్వేనెం.కు సంబంధించి, చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంకు చెందిన మార్కపూడి నాగేశ్వరరావుకు సర్వేనెం.237/అ/3,లో 0.37 గుంటలు, 237/6/4/2/2లో 0.0950 గుంటల సక్సేషన్‌కు సంబంధించి, కల్లూరు మండలం రఘునాథగూడెంకు చెందిన మారీదు సీతారామవమ్మకు సర్వేనెం.46/ఆ/2/2లో 0.19 గుంటల సక్సేషన్ సమస్యలను జిల్లా కలెక్టర్ సత్వరమే పరిష్కారం చూపి ఉత్తర్వు ప్రతులను జారీచేశారు. కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంకు చెందిన రైతులు తమ చేలకు కరెంటు కనెక్షన్ ఇప్పించగలరని, 30 డిడిలు తీసి చెల్లింపులకు సిద్దంగా ఉన్నామని తమకు కరెంటు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్యకై విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరుకు సూచించారు. కల్లూరు మండలం నూతనకల్ శివారు హనుమతండాకు చెందిన బి.శ్రీదేవి తాను తన మరిది బానోతు జోశ్యగారి వద్ద 1 ఎకరము 10 కుంటల వరి పొలము, తన మరదలు ఇ.రలిజా వద్ద 12.1/2 కుంటలు కొనుగోలు చేయడం జరిగిందని, అట్టి భూమికి సంబంధించి తల్లాడ తహశీల్దారు కార్యాలయంలో సమర్పించడం జరిగినది. పట్టాదారు పాసుపుస్తకము జారీచేయబడలేదని, అట్టి భూమికి రైతుబంధు కూడా రావడం లేదని తనకు పట్టాదారు పుస్తకము, రైతుబంధు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం తల్లాడ తహశీల్దారు ఆదేశించినారు. సత్తుపల్లి పట్టణంకు చెందిన చిత్తలూరి నరసింహారావు, కోటేశ్వరరావు, ప్రతాప్‌రెడ్డి, ఒగ్గు భగవన్‌రెడ్డి, కె.సత్యనారాయణ, టి.చిట్టెమ్మలు సత్తుపల్లి మున్సిపాలిటీ పట్టణంలో మెయిన్‌రోడ్ ప్రక్కన ఉన్న వెంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్ ప్రక్కన ఉన్న రోడ్‌కు మంజూరైన సిమెంటు రోడ్డును త్వరితగతిన పూర్తిచేయింగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్త సత్తుపల్లి మున్సిపల్ కమీషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. కొణిజర్ల మండలం మల్లుపల్లి గ్రామంకు చెందిన రైతులు తాము ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న వ్యవసాయ భూములు నీటి సదుపాయం లేక పంటలన్నీ ఎండిపోవడం జరుగుతుందని, పంటల సంరక్షణకు బోరు బావులు వేసుకోవడానికి అనుమతించ గలరని సమర్పించిన దరఖాస్తును ప్రభుత్వ నిబంధనలన మేరుకు తగు చర్య నిమిత్తం భద్రాచలం గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు అధికారికి సూచించారు. కూసుమంచికి చెందిన షేక్ గోరేమియా తాను హోటల్ వ్యాపారం చేసుకొని జీవిస్తున్నానని తన హోటల్ వద్దగల పెద్దమోరీ ద్వారా బస్టాండ్ నుండి వచ్చే మురుగునీటిని మోరీద్వారా వదలడం ద్వారా దుర్వాసనతో ఉండలేకపోవడం జరుగుతుందని అట్టి సమస్యను పరిశీలించి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం కూసుమంచి ఎంపిడిఓను ఆదేశించారు. ఖమ్మం నగరం ధంసలాపురం కొత్తకాలనీకి చెందిన సోమనబోయిన రజిత తాను డిగ్రీ చదువుకొని కంప్యూటర్ పిజిడిప్లోమా చేసియున్నానని తాను ఒంటరి మహిళనని తనకు మీసేవా కేంద్రంకు అనుమతి ఇప్పించగలరని పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంకు చెందిన జోనెబోయిన అన్నపూర్త మీ సేవా కేంద్రంకు అనుమతించ గలరని సమర్పించిన దరఖాస్తుల ను తగు చర్య నిమిత్తం ఈ డిస్ట్రీక్ మేనేజర్‌కు సూచించారు గ్రీవెన్స్ డేలో అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్, ఆర్‌డిఓ గణేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు