మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించండి

సంక్రాంతిని సంతోషంగా జరుపుకోనివ్వండి

కలెక్టరేట్ ధర్నాలో సుతారి రాములు

జగిత్యాల, జనవరి 8: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు నెలల మెస్ బిల్లులు పెండింగులో ఉన్నాయని మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ సర్కారు బిల్లులు చెల్లించి సంక్రాంతిని సంతోషం గా జరువుకొనివ్వాలని ఏఐటియుసి జగిత్యాల జిల్లా అధ్యక్షులు సుతారి రాములు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజన్సీ కార్మికుల 6 నెలల పెండింగ్ వేతనాలకై ధర్నా చేపట్టి కలెక్టరేట్ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూతారి రాములు మాట్లాడుతూ గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఆరు నెలల పెండింగ్ వేతన బిల్లులు ఇంతవరకు అందలేదని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా సమస్య పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో మెస్ చార్జీలు ఒక విద్యార్థికి 25 రూపాయలు పెంచాలని అన్నారు ప్రభుత్వము కోడిగుడ్డు ఐదు రూపాయలు ఇస్తే మార్కెట్లో ఏడు రూపాయలు పెట్టి కొనవలసి వస్తుందని ఈ గుడ్లను వారంలో మూడు సార్లు పెట్టాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వమే కోడిగుడ్లను సరాపార చేయాలని లేనియెడల గుడ్డు వండడం నిలిపి వేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు పదివేల వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని వెంటనే దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, వంట కార్మిక సంఘ నేతలు మునుగోరి హనుమంతు, వెన్న మహేష్, చుక్క లక్ష్మీరాజం, సంగారం భూమయ్య, చొప్పరి గంగాధర్, కొంకా భాగ్య, కూనా సరస్వతి, చెన్నవేణి దశరథం, బెక్కం లత, అగ్గిమల్ల రాధ, రజియా, లక్ష్మి, గంగు, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking