తల్లికి చేతులు లేవు.. కొడుకులకు తీరిక లేదు

తెలంగాణ తల్లి విగ్రహంపై నిర్లక్ష్యం

జగిత్యాల ప్రతినిధి, జనవరి 8(ప్రజా బలం)సుదీర్ఘ పోరాటాలు, ఎందరో ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తెలంగాణ తల్లి వెలిసింది. ప్రపంచ నలుమూలల తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల తెలంగాణ తల్లిగా కీర్తించబడుతున్న తెలంగాణ తల్లికి రాష్ట్రములో అనేక ప్రాంతాల్లో విగ్రహాలు వెలిశాయి. ఇలా వెలిసిన విగ్రహాలకు మొదట ఆదరణ మెండుగా ఉన్నా కాల క్రమేణ నిర్లక్ష్యం పెరుగుతూ వచ్చింది. ఇదే క్రమంలోనే జగిత్యాల రూరల్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ మూడురోడ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎపుడో. నిర్మాణ లోపమో, కొందరి కొంటె తనమో తెలియదుగానీ తిమ్మాపూర్ గ్రామ తెలంగాణ తల్లి విగ్రహానికి రెండు చేతులు పోయాయి. నెలలు గడుస్తున్నా గ్రామ పంచాయతీ అధికారులు. స్థానిక బీఆర్ ఎస్ నాయకులు ఉగ్రహానికి ఎదురైన నష్టంపై ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు అంటున్నారు. మరికొందరైతే కొడుకులకు తీరిక లేదు..తెలంగాణ తల్లి విగ్రహానికి చేతులు రావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking