మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో స్వయంభు మహాన్విత్వమైన కూర్మ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకమైన పూజలు చేసి, స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, నాయకులు ఎలక్షన్ రెడ్డి, అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వంటెర్ ప్రతాప్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డిస్తూ పచ్చని పంట పొలాల మధ్య భగవంతుని అన్నప్రసాదం స్వీకరించడం అదృష్టమని భక్తులకు వివరించారు. దైవ దర్శనం భక్తి మార్గంతోనే మానవ మనుగడకు ప్రశాంతత దొరుకుతుందని , భక్తి మార్గం ఉన్నవారికి మానవ మనుగడకు కావాల్సిన మంచి లక్షణాలు ఉంటాయని, వారు అభివృద్ధి దశలో ఉండి పదిమందికి సహాయపడాలని వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో, తూప్రాన్ మండల జెడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు మామిళ్ళ జ్యొతి కృష్ణ, మామిడి వెంకటేష్, గ్రామ పెద్దలు గడ్డం సత్తయ్య, వెంకట్ నారాయణ, మామిళ్ల లింగం, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి,మల్ల రెడ్డి, తిమ్మాపురం నరసింహులు, గడ్డం రవీందర్, వెంకటేష్ యాదవ్,పసుల నారాయణ,జంగం రాములు, ఆంజనేయులు,కుమ్మరి నర్సింలు,జయరామ్,తలారి బలేశ్, ప్రజా ప్రతినిధులు, ఆలయ ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులు, భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .