ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
బండి సంజయ్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మహిళాఅని చూడకుండా అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని సంజయ్ తీరును తప్పుబట్టారు. అనంతరం బండి సంజయ్ పై
చట్టపరంగా కేసులు నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని నిర్మల్ పట్టణ సీఐ కి ఫిర్యాదు చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మారుగొండ రాము, తదితరులు పాల్గొన్నారు.