వైద్యులు దైవసమానులు.. వైద్యో నారాయనో హరి.. జడ్చర్లలో ఘనంగా డాక్టర్స్ డే

జడ్చర్ల జూలై 1 ();జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నపురస్కరించుకొని జడ్చర్ల పట్టణంలోని విజయ క్లినిక్ లో సీనియర్ ఎంబీబీఎస్ డాక్టర్ రామిరెడ్డిని సన్మానించి బీసీ సేన నాయకులు, శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా లింగంపేట శేఖర్, నిరంజన్, గోపాల్ మాచారం శ్రీనివాస్, సురభి విజయ్ కుమార్ , ఆకుల చంద్రమౌళిలు మాట్లాడుతూ వైద్యులు దైవసమానులని, దైవానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ రామ్ రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారుగత 50 సంవత్సరాలుగా, విద్య రంగంలో నిరంతరం సేవలందిస్తూనే ఉన్నారని ప్రభుత్వ వైద్యులు గా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నిరుపేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తూ, నిరుపేదలకు ఉచితంగా మందులు కూడా అందిస్తున్నారు. నేటి యువ డాక్టర్లందరూ డాక్టర్ రామ్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యరంగం తో పాటు రాజకీయ రంగం, లైన్స్ క్లబ్ ద్వారా కూడా ప్రజలకు సేవలు అందించిన గొప్ప సేవ నిరతుడని ఆయన సేవలను కొనియాడా, ఈ కార్యక్రమంలో బీసీసేన మండల అధ్యక్షులు బొల్లె మోని నిరంజన్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లింగంపేట్ శేఖర్, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, జిల్లా నాయకులు గోపాల్,మాచారం శ్రీనివాస్, కార్మిక విభాగం మండల అధ్యక్షులుఆకుల చంద్రమౌళి,మండల కార్యదర్శి సురభి రఘు, శివ రాములు, సురభి ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking