ఫీజుల బకాయిల 5వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి
కార్పొరేట్ కాలేజీలను నిషేధించాలి
తెలుగు సంక్షేమ భవన్ ముట్టదించిన బీసీ విద్యార్థులు
హైదరాబాద్ జూలై 1)ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల రియంబర్స్ మెంట్ స్క్రీమును పునరుద్దించాలని, గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిల 5 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ లు, RDO, MRO, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిలో భాగంగా వందలాది మంది విద్యార్ధులు నేడు తెలుగు సంక్షేమ భవన్ ముట్టడించారు. ఈ ముట్టడికి రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ నాయకత్వం వహించారు. రాజ్యసభ సభ్యులు, జాతీయ బి.సి సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, బి.సి నాయకులు ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేష్, సుధాకర్, BC వెంకట్, భాస్కర్ ప్రజాపతి, మల్లేష్, సాయి గౌడ్, అనిల్, చంద్ర శేఖర్, రమ ముదిరాజు, వంశీ, ప్రజిత్ పాల్గొని ప్రసంగిచారు.ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ ఇంజనీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బి.సి. విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. గత 2 సంవత్సరాల ఫీజుల బకాయిలు 5 వేల కోట్లు వెంటనే చెల్లించాలి.అలాగే ఐఐ.టీ – ఐ.ఐ.ఎం – ఎన్.ఐ.టి తదితర కోర్సులకు కూడా పూర్తి ఫీజులు చెల్లించాలి.కాలేజి విద్యార్థులకు సంవత్సరంకు ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్తున్న మాదిరిగా 20 వేల స్కాలర్ షిప్ ను మన రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలన్నారు. ముట్టడిని ఉద్దేశించి వేముల రామ కృష్ణ ప్రసంగిస్తూ శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఎక్కువ ఫీజులులాగుతు రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారు. బట్టీ చదువులు, బలవంతపు చదువులతో విద్యార్థులను వేధిస్తున్నారు. అందుకే రోజుకొక్కరు చనిపోతున్నారు. రాష్ట్రంలోని 60 శాతం విద్యార్థులు ఈ కాలేజీలలో చదువుచున్నారు. ఈ కాలేజీల వల్ల విద్యావ్యవస్థ భ్రష్ఠు పడుతుంది. వీటిని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తూ ఆత్మహత్యలకు దోహధం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలను నిషేధించాలని కోరారు.