తెలంగాణ సాయుధ పోరాటంలో చెరగని ముద్ర దొడ్డి కొమురయ్య జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 04 : తెలంగాణ సాధన పోరాటంలో దొడ్డి కొమురయ్య తనకంటూ చెరగని ముద్ర వేసుకుని చిరస్మరణీయుడిగా నిలిచాడని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.దొడ్డి కొమురయ్య 78 వ వర్థంతి సందర్భంగా గురువారం జిల్లాలోని నస్పూర్ లోగల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్ తో కలిసి హాజరై దొడ్డి కొమురయ్య చిత్రం పటనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య ఆద్యుడు అని ఆయన త్యాగం నేటి తెలంగాణ సమాజానికి గణనీయంగా మేలు చేసిందని అన్నారు. సాధన గొర్రెల పెంపకదార్ల కుటుంబాలం లో1927లో జన్మించి నిజం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం వీరోచిత పోరాటం చేశారని,వెట్టిచాకిరీ నుండి ప్రజలను విముక్తి చేసేందుకు విశేషంగా కృషి చేశారని అన్నారు.ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలను అందించేందుకు నిజాం ను ఎదిరించి పోరాడి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుడిగా నిలిచారని అన్నారు.ప్రభుత్వం మహానుభావుల జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందని, ప్రతి ఒక్కరూ మహనీయులు ఆచరించి చూపిన మార్గాలను ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో నడుస్తూ దేశ అభివృద్ధికి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్, కలెక్టరేట్ పాలన అధికారి పిన్న రాజేశ్వర్,జిల్లా అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking