ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 04 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్బంగా డీసీపీ సిబ్బందితో మాట్లాడుతూ…పోలీస్ స్టేషన్కి వచ్చే పిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ఉండలన్నారు.స్టేషన్ పరిసరాలు,సిబ్బంది క్వాటర్స్ పరిశీలించారు.సిబ్బంది పనితీరు,పోలీస్ స్టేషన్ పరిసరాలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సిబ్బందికి పలు సలహాలు,సూచనలు అందజేశారు. మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి లక్షెట్టిపేట వచ్చిన డీసీపీ ఎస్సై చంద్రకుమార్ పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్,సిఐ నరేందర్,ఎస్సై చంద్రకుమార్,ఎస్సై-2 థానాజీ ఉన్నారు.