_గాంధీని పూజిస్తారా.. గాడ్సేనా
నిజామాబాద్ వేదికగా మోడీ చెప్పాలి_
గతం జీవన్ రెడ్డి.. భవిష్యత్తు సంజయ్
_సంజయ్ ను గెలిపించి కొరినవి పొందాలి
మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 3,( ప్రజాబలం) నూట యాబైఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలోనే గ్యారంటీని కోల్పోయిందని ఆ పార్టీ ఇచ్చే హామీలకు వారంటీ కూడా ఉండదని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం జగిత్యాలలో డబుల్ బెడ్రుమ్, ఎస్పీ పరిపాలన భవనం, సమీకృత మార్కెట్ తోపాటు పలు అభివృద్ధి పతకాలను ప్రజలకు అందించేందుకు కేటీఆర్ జగిత్యాలకు వచ్చారు. జగిత్యాల మినిస్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఏ పతకం పై నూట యాభై ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు రాలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పతకాలు దేశానికి ఆదర్శం కాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆరు పతకాలను ప్రకటించారన్నారు. ప్రతి వస్తువును ఒక గ్యారంటీ, ఒక వారంటీ ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ఏ వస్తువుకు వందేండ్ల గ్యారంటీ ఉండదని అలాంటి వందేండ్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తన గ్యారంటీని కోల్పోయిందని ఇక ఎన్నికల్లో గెలిస్తే ఇస్తామన్న హామీలకు వారంటీ కూడా ఉండదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇలాంటి గ్యారంటీ లేనిపార్టీల హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కేటీఆర్ కోరారు. మళ్ళీ బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అదే కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారా చెప్పగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి సిటు కోసం కొట్లాడుతాడాని ఇది కాంగ్రెస్ పార్టీ దుస్థితి అన్నారు. ఇక జగిత్యాల లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంత్రి హోదాలో జగిత్యాలకు చేసిన అభివృద్ధి ఏమిలేదన్నారు. కానీ ప్రతిదానికి పుల్లపెట్టడం అణునిత్యంగా మార్చాడన్నారు. అందుకే జీవన్ రెడ్డి గతం.. సంజయ్ భవిష్యత్తు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కేటీఆర్ కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మంచివాడని కొనియాడిన కేటీఆర్ తొలి ఐదేండ్ల కాలంలోనే జగిత్యాల అభివృద్ధికి ఎంతో కృషిచేశాడన్నారు. జగిత్యాల నియోజకవర్గములో ఉన్నన్ని డబుల్ బెడ్రుమ్ ఇండ్లు ముఖ్యమంత్రి నియోజకవర్గ మైన గజ్వేల్ లో లేవని నా సిరిసిల్ల నియోజకవర్గంలోను లేవన్నారు. 4 వేల నాలుగు వందల 62 ఇండ్లను సాధించిన డా. సంజయ్ ఇది ఆయన పనితీరుకు నిదర్శనమని కేటీఆర్ కొనియాడారు. అలాగే సంజయన్న కంటి వైద్యం పొందని ఉరుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతొందని అందులో భాగమే సమీకృత కలెక్టరేట్ భవనం, మెడికల్ కళాశాల వంటివన్నారు. ఈ ప్రాంత ప్రజలు గత కాంగ్రెస్ పాలనను గుర్తుచేసుకోవాలని ఆనాడు మోటర్లకు కరెంటు కోసం నిరీక్షించేవారమని ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలిసేది కాదన్నారు. ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నామని ఇటీవలే ఒక కాంగ్రెస్ ఎంపీ 24 గంటల కరెంట్ ఇస్తే తన పదవినే వదిలేస్తానని ప్రగల్భాలు పలికాడని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నానని బసు ఏర్పాటు చేస్తామని తిండి కూడా పెడతామని జగిత్యాల కు వచ్చి మీకు నచ్చినచోట కరెంటు వైర్లు పట్టుకోవాలని కరెంటు ఉంటే ఒక దరిద్రం పోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు పథకాలు అమలు చేస్తామని అంటున్నారని అయితే 3 గంటల కరెంటు ఇవ్వడం గ్యారంటీ అని కేటీఆర్ చెప్పారు. హెలిక్యాప్టర్ వస్తూనే వరద కాలువ కనిపించిందని అందులోని నీళ్లను చూస్తే కడుపునిడుతోందన్నారు. కేసీఆర్ కృషితో కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్తో వరద కాలువకు మల్లిస్తే రైతన్నలు సంతోషంతో ఉన్నారన్నారు. ఇక రాష్ట్రంలో 4 లక్షల 25 వేల మంది బీడీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీ పెన్షన్ ఇస్తున్నారని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని ఎక్కడ కార్మికులకు పెన్షన్ లేదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓ సిద్ధాంతమంటూ లేదని ఒక ఆరెస్సెస్ నాయకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షున్ని చేసిందని ఇదే విషయాన్ని ఆపార్టీ పంజాబ్ ఎంపీ అమరెందర్ సింగ్ సోనియాకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. బిజెపి పార్టీకి బీఎస్పీ పార్టీకి పొత్తు ఉందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయని వాస్తవానికి మోదీని కేసీఆర్ తిట్టినన్ని సార్లు ఎవరైనా తిట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. బిజెపి మతతత్వ పార్టీ అని ఎప్పుడు హిందు ముస్లింల మధ్య గొడవలు లేపి ఓట్ల లబ్ధిపొందాలని చూస్తుందని కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ రానున్న మోదీని ప్రశ్నిస్తున్నానని బిజెపి పార్టీ గాంధీని ఆరాధిస్తారా లేక గాంధీని చంపిన గాడ్సేను ఆరాధిస్తారా చెప్పాలని సభావేధిక సాక్షిగా కేటీఆర్ సవాల్ విసిరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సౌమ్యుడని, మంచిమనిషని ఈ నాలుగేండ్లల్లోనే జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని మరోసారి గెలిపిస్తే మీరు కోరిన తరహాలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజిని, పెప్సీ కానీ కోకోకోలా కంపెనీతో మామిడి రైతుల కోసం కంపెనీనే ఏర్పాటు చేస్తామని ఆశీర్వదించి మరోసారి డా. సంజయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.