ప్రభుత్వ దావకానాల్లో వేసవిలో సమస్యలు ఉత్పన్నం కావద్దు

👉 త్రాగునీటి సౌకర్యం త్రాగునీటి సమస్యపై మంత్రి సమీక్ష

👉 వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలి మంత్రి దామోదర

👉 ఇతర అంశాలపై ఉన్నతాధికారులతో దామోదర్ రాజనర్సింహ సమీక్ష( వీడియో కాన్ఫరెన్స్)

ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 14, (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా, ప్రభుత్వ దావకానాల్లో తాగునీటి సౌకర్యం అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, ఇతర అంశాలపైఉన్నతాధికారులతో, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు,వారి అటెండెంట్లకు హాస్పటల్ సిబ్బందికి, తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఉన్నత అధికారులకు మంత్రి ఆదేశించారు, పెద్ద హాస్పిటల్స్ లో ప్రతి బ్లాక్ ప్రతి ఫ్లోర్లో లో డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున, ఉక్కపోత సమస్య ఎక్కువ అవుతున్నదని, ఈ నేపథ్యంలో అవుట్ పేషెంట్లకు ఇన్ పేషెంట్లకు హాస్పటల్ సిబ్బందికి డాక్టర్లకు ఇబ్బందికలగకుండాచూసుకోవాలని అన్నారు, అవసరమైన చోట ఫ్యాన్లు కూలర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు, ఐసీయులు అవసరమైన ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు, ఫ్యాన్లు కూలర్లు ఏసీలు రిపేర్లు ఉంటే వెంటనే రిపేరు చేయించారని ఆదేశించారు, అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలన్నారు, వేసవిలో అగ్నిప్రమాదలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు, అన్ని హాస్పిటల్స్ లో అగ్ని ప్రమాదాలకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు, షార్ట్ సర్క్యూటు వల్లే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ఈ నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్ లో పవర్ కేబుల్స్ ను వెంటనే చెక్ చేయించాలని మంత్రి ఆదేశించారు, అవసరమైన చోట పాత వైర్ల స్థానంలో కొత్త వైరింగ్ చేయించాలని, సూచించారు హాస్పిటల్ లోపల బయట గుట్కా నమలటం, స్మోకింగ్ డ్రింకింగ్ వంటి చర్యలను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దని, ప్రతి హాస్పిటల్లోనూ ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్స్, ఉన్నాయా లేదా పరిశీలించాలన్నారు, మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో లేవో చూడాలని, వాటి తుది గడువు తేదీలను సైతం చెక్ చేయాలని, ఆదేశించారు, అలాగే మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై, ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ కి శిక్షణ ఇవ్వాలని, ఉన్నత అధికారులకు మంత్రి సూచించారు, ఫైర్ సేఫ్టీ షార్ట్ సర్క్యూట్ కు సంబంధించిన చేయాల్సిన చేయకూడని పనుల గురించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు, అవసరమైతే వడదెబ్బ బాధితుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు, వేసవికాలంలో గాలి దుమారాలు ఈదురు గాలులు అకాల వర్షాల వలన, విద్యుత్ సరఫరాలలో ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఇలాంటి సమయాల్లో పేషంట్లకు ఇబ్బంది కలగకుండా, వెంటనే జనరేటర్ ఆన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు, ఎండలుముదురుతున్నందున,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking