పందెంవాగు దుర్వాసన భరించలేని ప్రజానీకం

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 14 ఏప్రిల్ 2025
మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ తలపెట్టిన గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ది ట్రయల్స్ గేటెడ్ కమ్యూనిటీ మరియు పందెంవాగు పరిసర ప్రాంత నివాసస్థులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు ప్రస్తావించిన ప్రధాన సమస్యలలో ది ట్రైల్స్ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర నుంచి నిక్నాంపూర్ చెరువు వరకు పారుతున్న పందెంవాగు నుంచి వస్తున్న దుర్వాసనతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని కావున వెంటనే అరికట్టడంతో పాటు గతంలో జి.హెచ్.ఎం.సి వారు తలపెట్టిన నాలాపై కాంక్రీట్ స్లాబ్ ను నిర్మించాలని కోరారు. పంచవటి కాలనీ రోడ్ నెంబర్ 10 లో ఉన్న సంగీత అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో పందెంవాగు పై ఒక చెక్ డ్యామ్ నిర్మించి మురుగు నీటిని షేక్పేట్ నాలాకు మళ్ళించాలని, దానితో పాటు షేక్పేట్ నాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కోరడం జరిగినది. ది ట్రైల్స్ గేటెడ్ కమ్యూనిటీ ఎదురుగా నిర్మాణమైన రోడ్డుతో కూడిన బాక్స్ డ్రైన్ ప్రజల అవసరార్థం తక్షణమే అందుబాటులోకి తీసుకు రావాలని కోరడమైనది. ఈ ప్రాంతంలో ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పడిన కారణంగా తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నదనీ కావున మణికొండ మున్సిపాలిటీ, జి.హెచ్.ఎం.సి మరియు సైబరాబాద్ ట్రాఫిక్ వారు సమన్వయంతో సమస్యలకు అతి త్వరగా పరిష్కారం చూపాలని భారత రాష్ట్ర సమితి మణికొండ అధ్యక్షుడు సీతారం ధూళిపాళ, ఉపేందర్నాథ్ రెడ్డి, సంగం శ్రీకాంత్, కిరణ్ యాలాల, బుద్ధోలు బాబు, భాను చందర్, రామసుబ్బ రెడ్డి, సుమనళిని, చెరుకూరి బాలాజీ, శ్రీనివాస చారి, రమణ మూర్తి, తిరుపతి, గోపి సాగర్, సంతోష్ తది తరులు అధికారులను కోరడమైనది.

Leave A Reply

Your email address will not be published.

Breaking