ఓటు అనే వజ్రాయుధాన్ని ఎన్నికల పర్వంలో వృధా పరచవద్దు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 05 మే 2024:
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న బండ్లగుడ మునిసిపల్ కౌన్సిల్ కమీషనర్ శరత్ చంద్ర అధ్యక్షతన మణికొండ కౌన్సిల్ అంతర్భాగమైన అలకాపురి టౌన్షిప్ లనీ మహత్మా గాంధీ పార్క్ లో మే 05 ఆదివారం రోజున ఓటర్ అవగాహణ సదస్సు నిర్వహించడ మైనదనీ, జాతి మత వేష భాష కుల వర్గ ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రజా స్వామ్య దేశ సత్ సాంప్రదాయాలను కాపాడడానికి 13 న జరిగే ఎన్నికలలో ఓటు అనే వజ్రాయుధాన్ని ఎన్నికల పర్వంలో వృధా పరచకుండా నిర్భయంగా ఓటు వేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు, ఈ కార్యక్రమంలో స్థానిక అల్కాపూర్ అధ్యక్షుడు వంశీ, ఆల్ కాలనీ ఫెడ్రేషన్ కార్యదర్శి ఆంజనేయులు, వీ ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు కోశాధికారి దిలీప్ కక్కడ్ లు హాజరై విలువైన సందేశాన్ని తెలియ పరచడమైనది. ఎన్నికల సమయంలో వరుస సెలవులున్నవని, అశ్రద్ధ చేయకుండా భారత దేశ పౌరునిగా తమవంతు కర్తవ్యంగా అమూల్య మైన ఓటు వేయాలని నోడల్ అధికారి శరత్ చంద్ర తెలియ పరచడమైనది.

Leave A Reply

Your email address will not be published.

Breaking