ఆదివాసిలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది
నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉషాకిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ విజయ్
ఖమ్మం ప్రతినిధి మే 5 (ప్రజాబలం) ఖమ్మం గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల నుంచి దోసి పెద్దలకు పెట్టడం అలవాటుగా మారి, అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం మరచి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్న బీజేపీ కి తగిన బుద్ధి చెప్పాలంటే ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాంరెడ్డికి ఆదివాసీ, గిరిజనులు సంపూర్ణ మద్దతుతో గెలిపించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉషాకిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ విజయ్ లు అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశంలో రైతు వ్యతిరేక చట్టాలతో రైతులు, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిందని అన్నారు. ఆదివాసులు, గిరిజనుల బ్రతుకులను సిద్రం చేసేందుకు మనువాదాన్ని బీజేపీ పెంచి పోషిస్తోందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని విస్మరించి ప్రజాస్వామ్య విలువలను పతనం చేసేందుకు రిజర్వేషన్లను రద్దుచేస్తామని ప్రకటిస్తున్నారన్నారు. తెలంగాణలో ఆదివాసి, గిరిజన వికేంద్రీకరణ అభివృద్ధి కోసం మూడు ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదివాసీలు, లంబాడీలు, ఏకలవ్యులు వారి ఓటును ఏకపక్షంగా కాంగ్రెస్ కు వేసి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లం దేవరాయ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఝాన్సీలక్ష్మి, ఆర్గనైజర్లు దేవరాయ సురేష్, వలువాయి శ్రీను, రాష్ట్ర బంజారా మహిళా కో-కన్వీనర్ వినోద నాయక్, బల్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.