కార్యకర్తల సంపూర్ణ అండదండలతో ముందుకు సాగుతున్న కార్

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 05 మే 2024:
బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల సంపూర్ణ అండదండలతో ఆదివారం రోజున రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అంతర్ భాగమైన మణికొండ పంచవటి కాలనీలో మున్ముందుగా స్థానిక శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్ మరియు మాజీ మంత్రి ప్రస్థుత శాసన సభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డిల పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు కుంటూ కేక్ కటింగ్ చేసిన తదుపరి ఉత్సాహ భరితంగా పంచవటి కాలనీ లోనీ ప్రతీ వీధిలో పాదయాత్ర కొన సాగిస్తూ కార్ ను గెలుపు దిశగా ముందుకు సాగిస్తూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు అత్యధిక మెజారిటీ ఇప్పిస్తామని బీ.ఆర్.ఎస్. కార్యకర్తల ఎనలేని పట్టుదల కృషితో పార్టీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కలుస్తూ ప్రభా వితం గవిస్తూ ఈ నెల 13న జరిగే ఎన్నికలలో బ్యాల్లెట్లోనీ 1వ నంబర్ కార్ గుర్తు బటన్ పై నొక్కి అమూల్యమైన ఓటును ఎల్లవేళల అందుబాటులో ఉండే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు వేసి కని విని ఎరుగని మెజారిటీతో పార్లమెంట్ కు పంపాలని ఇట్టి కార్యక్రమంలో మణికొండ బీ.ఆర్.స్. పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, మాజీ ఏం. పీ. పీ తలారి మల్లేశ్, ఆల్ కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య శ్రీరాములు, శైలజా వినోద్, మైనారిటీ నాయకుడు బషీర్, స్థానిక సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, రామ సుబ్బారెడ్డి, అందె లక్ష్మణ్ రావు, గుట్టమీది నరేందర్, లక్ష్మయ్య తదితరులు మరియూ ఉత్సాహంగా యువ నాయకులు, మహిళా నాయకురాల్లు పాల్గొని కార్యక్రమాన్ని రక్తి గట్టించినారు.

 

                     

Leave A Reply

Your email address will not be published.

Breaking