అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి

-ఏఐటీయుసి హన్మకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి

– 3వ రోజు చేరిన రిలే నిరాహార దీక్ష

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా ఆగస్టు2: హన్మకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ జితేందర్ సింగ్ నగర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించిన అర్హులకు ఇవ్వాలని హనుమకొండ తహసిల్దార్ కార్యాలయం ముందు కాలనీ గుడిసె వాసులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా ఏఐటీయుసి హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెల్పుల సారంగపాణి ఎస్సిఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర చంద్రమౌళి దీక్షలో కూర్చున్న వారికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సొంత ఇంటి కల సహకారం కోసం ఉన్న గుడిసెలు తీసివేసి ప్రతి పేదవాడికి ఇండ్లు ఇస్తామని చెప్పి పది సంవత్సరాల క్రితం డబల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వకపోవడం వల్ల కాలనీవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాలసముద్రంలోని సర్వేనెంబర్ 1066 లో గత 50 సంవత్సరాల క్రితం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బతుకుదెరువు కోసం వలస వచ్చిన దాదాపు 600 కుటుంబాల పేద ప్రజలు అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్ పేర్లతో గుడిసెలు వేసుకొని జీవించుచుండగా 2012 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన పథకం తీసుకువచ్చి, ఆ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్ లను ఎంపిక చేసి అప్పటి మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బందితో సర్వే చేయించి 576 మంది లబ్ధిదారులను గుర్తించారు అని అన్నారు.2015 లో రెవెన్యూ మున్సిపాలిటీ హౌసింగ్ డిపార్ట్మెంట్ లతో ప్రతి గుడిసెను అందులో ఉంటున్న కుటుంబ సభ్యులను ఫోటోలు తీసుకొని అందరి ముందు అప్పటి ఆర్డిఓ గ్రామసభ ఏర్పాటు చేసి మొత్తం 600 మంది లబ్ధిదారులు ఉన్నారని గుర్తించి లిస్ట్ తయారుచేసి ప్రతి ఒక్కరికి ఇల్లు పూర్తి చేసి అప్ప చెప్తామని హామీ ఇచ్చి గుడిసెలు ఖాళీ చేయించారు.2016 జనవరిలో ఇండ్ల నిర్మాణం ప్రారంభించి 2018లో నిర్మాణం పూర్తి చేశారు 2019 జనవరిలో పంపిణీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఇవ్వకుండా మోసం చేసింది అని అన్నారు.ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల క్రితం డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వకపోవడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ ఇండ్లు శిథిలా అవస్థలోకి మారాయని అన్నారు.ఇప్పటికీ కాలనీవాసులు గుడిసెలలో వర్షం ముప్పుకి గురై బురదలో వానల్లో విషపురుగులతో సహజీవనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ఇంకా ఇవ్వకుండా రేపు, మాపు అని దాటవేస్తుందని అన్నారు. వెంటనే అక్కడ ఖాళీ చేసిన స్థలంలో 594 ఇండ్లను అర్హులైన ప్రతి పేదవాడికి పంపిణీ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలో పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ అధ్యక్షులు ఓరుగంటి స్వామి, మామిడిపల్లి సుధాకర్,సౌరం రఘు, దరిగి రమేష్,గద్దపాటి లవకుమార్, రామంచ సతీష్, వంగాల రాజశేఖర్, గద్దపాటి సాయికుమార్,కుర్స పెల్లి రాజు,గుర్రం రాజు,శేషు,వంశీ,రంజిత్, లక్ష్మణ్,సుధాకర్,అంబాల నితిన్, సూరిబాబు,సాయిచంద్,పరమేశ్వర్, ప్రశాంత్,సాయి, రాహుల్, సారంగం అరవింద్,శివ,మాణిక్యం,సైదులు, రాజేష్,సింహాద్రి,రాజశేఖర్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking