విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 2:
మూడవ వార్షిక స్నాతకోత్సవం సందర్బంగా మహేంద్ర యూనివర్సిటీ బహదురుపల్లి లో ముఖ్య అతిధిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ మాట్లాడుతూ మానవ విలువలతో కూడిన విద్య సమాజంలో వ్యక్తి ఉన్నతికి తోర్పడుతుంది అని అన్నారు.
2014లో మహీంద్రా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రారంభమైనప్పటి నుండి దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన క్యాంపస్‌గా స్థిరపడిన ఇన్‌స్టిట్యూట్ – మహీంద్రా విశ్వవిద్యాలయంలో ప్రసంగించడం గొప్ప విశేషం అని అన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు మీ అందరికి సంతోషకరమైన రోజు. మీరు సాధించిన ఈ విజ్ఞానము, నైపుణ్యాలతో సాధించిన డిగ్రీ రేపటి మీ భవిష్యత్తుకు పునాది అని అన్నారు.
21వ శతాబ్దంలో ప్రపంచం చాలా వేగంగా మారుతున్న సందర్బంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అనేక సవాళ్ళను ఎదురుకోవలసి వస్తుందని దానికి తగ్గ నైపుణ్యం, సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి అని అన్నారు.గత కొన్ని దశాబ్దాలుగా, పారిశ్రామిక యుగం సమాచార యుగానికి దారితీసింది. మరియు ఆ మార్పు ప్రపంచాన్ని అన్ని రకాల సరిహద్దుల్ని అనుసంధానించింది. విజ్ఞానం మరియు సమాచారం అనేది జాతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయ సరిహద్దులకు చేరుతుందని,
అరి చేతుల్లోనే ప్రపంచ స్థితిగతులను వ్యాపా లావాదేవీలను ప్రపంచ నలుమూలల సమాచారం అంతర్జాలం వలన వీక్షించగలుగుతున్నాము,
సమస్య ఏమిటంటే, మన మేధో వనరులు ఈ సమాచార విస్ఫోటనానికి అనుగుణంగా లేవు కావున దానిని ఎదురుకోవడానికి తగిన మేధో మధనం జరగాలి,
డేటా సైన్స్ పరిశోధన సాధనంగా కీలక పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, ఖగోళ శాస్త్రంలో, ఇది కొత్త నక్షత్రాలు మరియు గెలాక్సీలను గుర్తించడంలో సహాయపడుతుంది.
అన్ని రంగాలలో సైన్స్ ద్వారా విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వేగంగా మారుతున్న ప్రపంచానికి అనువైన అతి చురుకైన జీవన విలువల గురించి దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు, గ్రాడ్యుయేట్లందరూ అత్యంత ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీయొక్క శక్తి సామర్ధ్యము నైపుణ్యము ఇందుకు ఉపయోగ పడతాయి అని మీరు గుర్తుంచుకోవాలి. మార్టిన్ లూథర్ కింగ్ ప్రకారం, “మీరు ఎగరలేకపోతే పరుగెత్తండి, మీరు పరుగెత్తలేకపోతే నడవండి, మీరు నడవలేకపోతే పాకండి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఐన మీ ప్రయత్నాలు ఆపకుండా ముందుకు సాగండి అని విద్యార్థులకు అవగాహనా కలిగించారు, మానవ విలువలతో కూడిన విద్య ఆవశ్యకతను తెలియజేసారు.
గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ మీ కళలను నెరవేర్చుకోవాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు యూనివర్సిటీ వ్యవస్థాపకుడు శ్రీ. ఆనంద్ మహేంద్ర,గెస్ట్ అఫ్ హానర్ గా శోభన కామినేని మరియు యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.