ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

 

ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగ నియామక పరీక్షల్లో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా నాయకులు బాలసాయ హరిప్రసాద్

మెదక్ ప్రజాబలం న్యూస్ :-

ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా నాయకులు బాలసాయి హరిప్రసాద్ స్వాగతిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశంపై జరిగిన చర్చలో మాదిగలకు అనుకూలమైన తీర్పును ఇచ్చిన న్యాయమూర్తులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుప్రీంకోర్టు వర్గీకరణ అంశంపై నియమించిన 7 జడ్జిలలో, 6 మంది జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చారు.ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బిజెపి,కాంగ్రెస్, బిఆర్ఎస్,సీపీఎం,సిపిఐ ఇతర రాజకీయ పార్టీలకు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలుపుతూ,ఆర్డినెన్స్ తెచ్చైనా ముందుగా తెలంగాణలోనే వర్గీకరణ అమలుచేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సంతోషకరమన్నారు.విద్య,ఉద్యోగ, ఇతర రంగాల్లో మాదిగ,మాదిగ ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏ,బి,సి,డి వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము.ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ,మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడుతామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ,మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ,అడ్వొకేట్ జనరల్ ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో కేసు విజయవంతం కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. గత 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేశామన్నారు.ఎస్సీ వర్గీకరణ కోసం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ లో, సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ బిల్ ఆమోదం పొందాలని 3 సార్లు దీక్ష చేశారన్నారు.న్యూఢిల్లీలో పోలీసులు దీక్షలు భగ్నం చేసే ప్రయత్నాలు చేసినా,బెదరకుండా, భయపడకుండా జంతర్ మంతర్ లోనే దీక్షలు చేశామన్నారు.ఎమ్మార్పీఎస్ కార్యకర్తల కృషి ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అని,ఎస్సీ వర్గీకరణ వల్ల ఉద్యోగ నియామకాల్లో మాదిగలకు,మాదిగ ఉప కులాలకు న్యాయం జరగబోతుందని సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking