అభినందనలు తెలుపుతున్న జిల్లా అధికారులు.
మెదక్ జనవరి 25 ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా వైద్యాధికారి ఉత్తమ డిఎంహెచ్ఓ వైద్యాధికారిగా చందు నాయక్ ఎంపికయ్యారు.
గురువారం హైదరాబాద్ లోని బేగంపేట లో జరిగిన 2022-23 సంవత్సరం హెల్త్ రివ్యూ సందర్బంగా మెదక్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ కు హెల్త్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, హెల్త్ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ల చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.
మెటర్నల్ హెల్త్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 5 వ ర్యాంకు, చైల్డ్ హెల్త్ మరియు ఇమ్యూనైజేషన్ లో 11వ ర్యాంకు, ఎనిమియా ముక్తా భారత్ లో 26 వ ర్యాంకు, టీబి లో ఫస్ట్ ర్యాంకు,తెలంగాణ డయాగ్నస్టిక్ లో 2వ ర్యాంకు,ఎన్సిడి లో ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు గాను బెస్ట్ డిఎంహెచ్ఓ అవార్డు లభించింది.
ఈ సందర్బంగా డాక్టర్ చందు నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు,వైద్యాధికారులు, సిబ్బంది సహకారంతో ఈ అవార్డు లభించిందన్నారు.
అవార్డు తనకు మరింత బాధ్యత పెంచిందన్నారు.
భవిష్యత్ లో మెదక్ జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్తామని అయన తెలిపారు.
డిఎంహెచ్ఓ చందునాయక్ కు అవార్డు రావడం పట్ల జిల్లాలోని వైద్యాధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.