రాష్ట్ర శాసనమండలి చీఫ్‌ విపుగా డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డి బాధ్యతలను స్వీకరణ

యాకత్‌పూర ప్రజాబలం ప్రతినిధి:రాష్ట్ర శాసనమండలి చీఫ్‌ విపుగా డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డి బాధ్యతలను స్వీకరణ
సెక్రటరీ నరసింహచార్యులు
సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ని
మర్యాద పూర్వకంగా
కలవగా, ఆయన మహేందర్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌,
ఎమ్మెల్యేలు రామ్మోహన్‌ రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌ ,ఈర్లపల్లి శంకర్‌, మల్రెడ్డి రంగారెడ్డి,
ఎమ్మెల్సీలు కోదండరాం, బల్మూరి వెంకట్‌, ఎగ్గే మల్లేష్‌, భాను ప్రకాష్‌, ప్రభాకర్‌,
మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్పర్సన్‌ పట్నం సునీత మహేందర్‌ రెడ్డి,
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ – మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన నాయకులు వజ్రేష్‌ యాదవ్‌ , చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ , పరమేశ్వర్‌ రెడ్డి రామ్మోహన్‌ గౌడ్‌, రోహిన్‌ రెడ్డి కొలను హనుమంత్‌ రెడ్డి, భీమ్‌ భరత్‌, పట్నం రినీష్‌ రెడ్డి, తదితరులు మహేందర్‌ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు
మహేందర్‌ రెడ్డి కామెంట్స్‌ :
మండలి చీఫ్‌ గా సీఎం రేవంత్‌ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
మండలిలో సీనియర్‌ సభ్యుడిగా సభ్యులందరికీ చేదోడు వాదోడుగా ఉంటాను.
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందరితో కలిసి చట్టసభల ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు నా వంతు కృషి చేస్తా.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తరఫున స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఉండడం సంతోషం. వారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం.
అందరికి అందుబాటులో ఉంటామన్నారు.
స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కామెంట్స్‌ :
రాష్ట్ర చట్టసభల్లో సుదీర్ఘ అనుభవమున్న మహేందర్‌ రెడ్డి గారికి మండలి చీఫ్‌ విప్‌ రావడం సంతోషకరం, శుభాకాంక్షలు.
సీనియర్‌ సభ్యులుగా మహేందర్‌ రెడ్డి మండలి లో శాసన తయారీ ప్రక్రియ, చర్చ లాంటి అంశాల్లో తోటి సభ్యులకు చేదోడువాదుడుగా ఉంటారు.
మహేందర్‌ రెడ్డి తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత సహాయ సహకారాలు అందిస్తాం.

 

     

Leave A Reply

Your email address will not be published.

Breaking