మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాధా కిషన్

మెదక్ ప్రజా బలం న్యూస్ :- మెదక్ జిల్లా విద్యాశాఖాధికారిగా డాక్టర్ రాధాకిషన్ శనివారం నాడు పూర్తి అదనపు భాద్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను మర్యాద పూర్వకంగా కలిసి బొకే ను అందజేశారు. వీరు హైద్రాబద్ లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్ధ లో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ నూతన జిల్లాలు ఏర్పడిన తరువాత అక్టోబర్ 2016 నుండి సిరిసిల్ల జిల్లా విద్యా శాఖాధికారిగా పూర్తి అదనపు భాద్యతలు నిర్వహించారు. ఇక్కడ పనిచేస్తున్న రమేష్ కుమార్ బదిలీపై జిల్లా విద్యాశాఖాధికారిగా సిరిసిల్లకు బదిలీ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking