మున్సిపాలిటీలలో త్రాగునీరు, లైటింగ్, పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

 

పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలి.

పనులు చేపట్టని ఏజెన్సీ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి…

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవు..

జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

సూర్యాపేట,ప్రజాబలం ప్రతినిధి:

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో త్రాగునీరు, లైటింగ్, పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి లో పనుల పురోగతి, నిధుల లభ్యత , పెండింగ్ పనులపై మున్సిపల్ కమిషనర్లు సంబంధిత ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో జంక్షన్ లలో లైటింగ్ ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచిస్తూ 80 శాతం వరకు పనులు పూర్తి అయిన వాటికి సత్వరమే పూర్తి చేయాలని మున్సిపాలిటీలలో మెరుగైన సౌలతులు కల్పించాలని సూచించారు. పట్టణాల్లో వివిధ నిర్మాణ దశలో ఉన్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పనుల విషయంలో ఎక్కడకూడా రాజీ పడవద్దని చేపట్టిన పనులకు ప్రత్యేక తనిఖీలు ఉంటాయని, ఎల్.ఆర్.ఎస్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య విషయంలో అశ్రద్ధ వహించిన, త్రాగునీటి సరఫరా లో అవాంతరం ఏర్పడిన, విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న బడతాయని కలెక్టర్ తెలిపారు. కేటాయించిన నిధులతో అనుమతులు తీసుకొని వివిధ దశల్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను సత్వర చేపట్టాలని సూచించారు. ఇచ్చిన పనులు ఇప్పటివరకు సరైన రీతిలో పూర్తిచేయని ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి నిబంధనల మేరకు కొత్త ఏజెన్సీలకు అప్పగించాలని కలెక్టర్ సూచించారు. అన్ని మున్సిపాలిటీలలో ఫాగింగ్, పారిశుధ్య పనులు నిరంతరం జరగాలని అలాగే మున్సిపాలిటీలలో కలసిన గ్రామాలలో పనుల పురోగతిపై పలు సూచనలు, సలహాలు చేశారు.తదుపరి ఆదనవు కలెక్టర్ తో కలసి
మున్సిపాలిటీల కు కేటాయించిన ఎస్.డి.ఎఫ్., టి. యు.ఎఫ్.ఐ. డి.సి పద్దులలో ద్వారా వచ్చిన నిధులు చేపట్టిన పనులు, పెండింగ్ పనుల పై మున్సిపాలిటీల వారీగా సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సమావేశంలో సి.పి.ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు సూర్యాపేట రామనుజుల రెడ్డి, కోదాడ వెంకటేశ్వర నాయక్, తిరుమలగిరి దండు శ్రీనివాస్,హుజూర్ నగర్ శ్రీనివాస్ రెడ్డి, నెరేడుచర్ల వెంకటేశ్వర్లు సంబంధిత ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking