– నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణ జరగాలి

 

– పబ్లిక్ క్లబ్ సభ్యుల సమావేశం

– నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు కార్యాచరణ

సూర్యాపేట, ప్రజాబలం ప్రతినిధి:

సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై సూర్యాపేట ఆర్డివో విచారణ జరపాలని పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు,సీనియర్ న్యాయవాది నూకల సుదర్శన్ రెడ్డి,మాజి కార్యదర్శి బొల్లెద్దు దశరధ అన్నారు.మంగళవారం క్లబ్ ఆవరణలో జరిగిన సభ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా కొప్పుల వేణారెడ్డి పనిచేసిన సమయంలో దుకాణ సముదాయం నిర్మాణం చేయడం వలన, జిమ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెరిగిందని, ప్రస్తుతం క్లబ్ ఆదాయం లక్షలలో వున్నదని అన్నారు. ప్రస్తుత సెక్రటరీ క్లబ్ యొక్క ఆధాయ వ్యయాలను కమిటీ సభ్యులకు తెలియజేయడం లేదని, సెక్రటరీ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో లక్షలాది రూపాయల అవినీతి కి పాల్పడినారని వారు అన్నారు. 12 నెలలకు ఒకసారి జనరల్ బాడి మీటింగ్ పెట్టవలసి వున్నప్పటికీ, సమావేశం నిర్వహించడం లేదని అన్నారు. పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ కాంట్రాక్టర్ రెండు సంవత్సరాల పాటు చెల్లించవలసిన అద్దె చెల్లించలేదని, అద్దె వసూలు చేస్తామని కార్యదర్శి చెప్పినప్పటికీ వసూలు చేయలేదని అన్నారు. కావున క్లబ్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై క్లబ్ చైర్మన్ సూర్యాపేట ఆర్డివొ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో
పబ్లిక్ క్లబ్ సభ్యులు ఎల్గురి చంటి బాబు,శనగాని రాంబాబు గౌడ్,కుమ్మరికుంట్ల లింగయ్య, గవ్వా కేశవరెడ్డి,రావుల రాంబాబు నాయుడు,అంజద్ అలి,షేక్ సైదులు,రుద్రంగి రవి,నాగుల వాసు,రావుల రాంబాబు, యలగందుల సాయినేత,గుణగంటి సైదులు,కుందామల్ల శేఖర్,ఎల్గురి వెంకటేశం,రాపర్తి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking