అధిక వర్షాల కారణంగా మెదక్ పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించినా కలెక్టర్

 

వర్షపు నీరు వరద ప్రవాహ ఉధృతిని అధికారులు అడిగి తెలుసుకున్న కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం- మెదక్ జిల్లా ప్రతినిధి 2 సెప్టెంబర్ 2024

మెదక్ జిల్లా కలెక్టర్ సంబంధిత మున్సిపల్ కమిషనర్ చంద్రపాల్ తో కలిసి
మెదక్ పరిసర ప్రాంతాలలో రాయనపల్లి పాతూరు మధ్యలో రోడ్డుపై వరద నీరు ప్రవాహాన్ని, మెదక్ రామయంపేట్ రోడ్ లోని నూతనంగా నిర్మించిన బ్రిడ్జి క్రింద వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ గడిచిన రెండు రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని, రానున్న రెండు రోజులు ఇదే స్పూర్తితో అప్రమత్తంగా ఉండాలని ఈ రెండు రోజులు చాలా ముఖ్యమని అన్నారు. అకాల వర్షాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగనియొద్దని వర్షపు నీరు నిల్వ ఉండు ప్రాంతాలను గుర్తించి దానికనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్టాయిలో రెవెన్యూ, పంచాయతి, పోలీస్ అధికారులు పరిస్థితులను పర్యవేక్షణ చేయాలన్నారు.
రహదారులపై నీళ్ళు వస్తే ప్రయాణాలు నియంత్రణకు ప్రమాద హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలల్లో పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. జలాశయాలకు వీక్షణకు ప్రజలు వస్తుంటారని నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పొంగే వాగులు, రహదారులపై వాహనాలు రాకపోకలు నియంత్రణ చేయాన్నారు.
గర్భిణీ స్త్రీలు , వృద్ధులు మరియు చిన్నపిల్లలు తప్పనిసరిగా ముందస్తుగానే పునరావాసకేంద్రాలలో ఉండవలెనని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking