జీళ్ళచెరువు లో వినాయక విగ్రహాం వద్ద పూజలు చేసిన దుర్గాప్రసాద్, రాయల ఘనంగా సన్మానించి కమిటీ బాధ్యులు

 

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళ చెరువు గ్రామంలోని మందుల కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం సీనియర్ జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య-ఎల్లమ్మ దంపతులు పీఠలపై కుర్చోని ప్రత్యేక పూజలు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పిసిసి సభ్యులు, పాలేరు నియోజక వర్గ నాయకులు రాయల నాగేశ్వరరావు హాజరై ప్రత్యేకంగా పూజలు చేశారు. వినాయక మండపం వద్ద అతిథులను గణేష్ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లా డుతూ జిల్లా ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని, సుఖసంతోషాలు పాడి పంటలతో ప్రజలంతా జీవించే విధంగా ఆ గణనాథుడు ఆశీర్వదిం చాలని కోరారు. రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో అభిమానంతో మమల్ని పిలిచి ప్రత్యేక పూజలు చేయించిన ఉత్సవ కమిటీకి ధన్యావాదాలు తెలిపారు. పాలేరు నియోజకవర్గ ప్రజలందరు సంతోషంగా ఉండే విధంగా చూడాలని, భక్తులందరికీ గణేశ్వరఢు చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండ్ర అంజయ్య, అయితగాని రాంగోపాల్, యాదగిరి, పెండ్ర ప్రసాద్, పెండ్ర రమేష్, పెండ్ర వెంకన్న, గుమ్మడెల్లి నరేష్, నగేష్, వెంకటేశ్వర్లు, వీరబాబు, తరుణ్, ఉపేందర్, వెంకన్న బక్కయ్య గురువులు, రిక్కి, హరీష్, కార్తిక్ తదితరులు హాజరైయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking