కేసీఆర్ పాలన లో దేశంలో నే నెంబర్ వన్ లో నిలిపారు తెలంగాణ రాష్ట్ర రూపు రేఖలు మార్చారని పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చ్ 21 : కేసీఆర్ పాలనలో దేశం లో నెంబర్ వన్ లో నిలిపారు తెలంగాణ రాష్ట్ర రూపు రేఖలు మార్చారని పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.గురువారం చెన్నూరు పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్ యందు చెన్నూర్ మున్సిపాలిటీ,మండలం, కోటపల్లి మండలం,భీమారం మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గున్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్,చెన్నూరు మాజీ శాసనసభ్యులు,మంచిర్యాల జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్.ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుసరించాల్సిన విధానాలను నాయకులకు వివరించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…తెలంగాణ కేసీఆర్ పాలన లో దేశంలోనే నెంబర్ లో నిలిపారు రాష్ట్ర రూపు రేఖలు మార్చారు. ఒక నాయకుడు పట్టుదల ఉంటే జఠిలమైన సమస్యలకు సమస్యలకు పరిష్కారం చూపుతారు అనడానికి నిదర్శనం కేసీఆర్ నేను డబ్బు కోసం పనిచేసే పొలిటిషన్ ను కాదు.రియల్ లీడర్ ను ప్రజల కోసం బ్రతికే మనిషిని.తెలంగాణ రాక ముందు కరెంట్ లేదు,నీళ్లు లేవు,ఆకలి చావులు, వలసలు ఉండే,60 సంవత్సరాలు పాలించిన పాలకులు,ఉచిత,కరెంట్, సాగు నీరు,ఎందుకు ఇవ్వలేదు. అది కేసిఆర్ కు ఎందుకు సాధ్యం అయ్యిందో ప్రజలు అర్ధం చేసుకోవాలి.కేసీఆర్ పాలనలో ఐటీ రంగంలో పరిశ్రమలకు 4 వందల కోట్లు పెట్టుబడులు కేటిఆర్ తెచ్చారు.అలాగే 18 లక్షల మందికి ఐటి రంగంలో ఉద్యోగాలు కేటీఆర్ హయాంలో ఇవ్వడం జరిగింది.12,660 గ్రామపంచాయతీలు పెరిగితే ఉద్యోగ కల్పన జరగలేదా, రెసిడెన్షియల్ స్కూల్ పెరిగితే కొత్త ఉద్యోగాలు రాలేదా, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తామే ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటుంది.సింగరేణిలో 18 వేల మంది డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ కదా,కాంగ్రెస్ పార్టీ అధికారం లో వచ్చాక పథకాల అమలు చేతకాక గత ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తుంది. తెలంగాణ వరప్రదాయాన్ని కాళేశ్వరంపై విష ప్రచారం చేస్తుంది. గోదావరి నీళ్లను ఒడిసిపట్టి రైతులకు అందించిన చరిత్ర కేసీఆర్ ది.

ప్రజలు కాంగ్రెస్ అబద్ధాల ప్రచారాలను నమ్మి మోసపోయి గోస పడుతున్నారు.చాలా మంది నాయకులు దురాశతో పార్టీలు మారుతున్నారు. లక్షల మంది కార్యకర్తలతో బలంగా పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ముఖ్యమంత్రి బహిరంగ సభలో మానవ బాంబు అవుతానని అంటున్నాడు. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు.రైతు బంధు అడిగినందుకు సీఎం వారి మంత్రులు చెప్పుతో కొడతామని అహంకారంతో మాట్లాడుతున్నారు.గెలుపు ఓటములు సహజం కార్యకర్తలు నిరాశ పడవలసిన అవసరం లేదు.చెన్నూర్ లో 1600 కోట్ల రూపాయల పనులను రద్దు చేశారు.అలాగే మూడు మున్సిపాలిటీలో 100 కోట్ల పనులు నిలిపివేశారు.
కేసీఆర్ పరిపాలనలో శత్రువులకు కూడా పని చేసింది.ఎన్నికల ముందు వచ్చిన వలస పక్షులు వివేక్,వినోద్,వంశీ. దేశంలోనే అత్యధిక ధనికుల్లో 9 వ స్థానంలో వీళ్ల కుటుంబం ఉంటుంది. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం విడ్డూరం.వివేక్ ది కుటుంబ పాలన కాదా.నేను ఈ మట్టిలో పుట్టిన బిడ్డను నా కుటుంబం మొత్తం సింగరేణి కార్మిక కుటుంబం.ప్రజల నుండి వచ్చిన నాయకుడిని.కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలు నాకు లేవు.కారు గుర్తుకే ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు,వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking