తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ గా మామిండ్ల జ్యోతీ కృష్ణ ఏకగ్రీవ ఎన్నిక.

ప్రజా ప్రతినిధులు అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టిన తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ .

తూప్రాన్, మార్చి, 21. ప్రజా బలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లో ఖాళీగా ఉన్న చైర్మన్ పదవి భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మార్చ్ 21న గురువారం తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కాజా కాజా మొహీనుద్దిన్ ఆధ్వర్యంలో నిబంధన ప్రకారం నిర్వహించారు. మున్సిపాలిటీలోని 16వ వార్డు సభ్యులు ఉండగా ఎక్స్ అఫీషియల్ వార్డు సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ కూర రఘెత్తం రెడ్డి , కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్ , కొడిప్యాక నారాయణగుప్త, నంద్యాల శ్రీనివాస్, జిన్నా భగవాన్ రెడ్డి, చింత రవీందర్ రెడ్డి, శ్రీమతి శ్రీ పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా , జమాల్పూర్ లక్ష్మీబాయి, మామిళ్ల జ్యోతి కృష్ణ, నర్సోజి ,చెలిమెల ప్రియాంక, బాణపురం రాజు, చైర్ పర్సన్ ఎన్నిక కాబడుట కొరకు ప్రతిపాదించాబడినారు.


మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ గా 4వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి మామిండ్ల జ్యోతీ కృష్ణ ముదిరాజు గురువారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో జయ చంద్రా రెడ్డి ప్రకటించారు. గురువారం ఉదయం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కు పది మంది కౌన్సిలర్లు ఒక ఎమ్మెల్సీ హాజరు కాగా ఎన్నికల నియమావళినీ ఎన్నికల అధికారి ఆర్డీవో జయ చంద్రా రెడ్డి చదివి వినిపించారు. అనంతరం చైర్మన్ గా 4వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల జ్యోతీ కృష్ణ ముదిరాజు ను చైర్మన్ గా కౌన్సిలర్ భగవాన్ రెడ్డి ప్రపోజ్ చేయగా 16 వార్డు కౌన్సిలర్ కోడిప్యాక నారాయణ గుప్త బలపర్చాడు. దీనితో మామిండ్ల జ్యోతీ కృష్ణ ముదిరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహికొద్ధిన్ చైర్మన్ ఛాంబర్ లో గ్రీన్ ఇంక్ పెన్ను లు ఇవ్వగా అధికార లాంచనాలతో భాద్యతలు స్వీకరించిన జ్యోతీ కృష్ణ ముదిరాజు మాట్లాడుతూ తన సహచర తోటి కౌన్సిలర్ల ధన్యవాదాలు తెలిపారు. తన కు ఇచ్చిన పదవి భాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెల్లుతానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా గతంలో మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పై అవిశ్వాసం పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. కాగా అవిశ్వాసం నెగ్గి ఇంఛార్జి చైర్మన్ గా కొనసాగిన నందాల శ్రీనివాస్ ఎప్పటి లాగే వైస్ చైర్మన్ గా కొనసాగుతారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఫర్మాలిటి ప్రకారం సాదా సీదాగా ప్రమాణ స్వీకారం జరిగింది.


తూప్రాన్ సిఐ కృష్ణ, ఎస్సై శివానందం ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా అవంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ప్రమాణస్వీకారం కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, సీనియర్ నాయకులు నేత మహేందర్ రెడ్డి, జింక మల్లేష్, బాలకృష్ణారెడ్డి, వెంకటేష్ యాదవ్, భగవాన్ రెడ్డి, తిమ్మాపురం నర్సింలు, సత్యనారాయణ గౌడ్, మామిండ్ల శ్రీనివాస్, నాగరాజ్ గౌడ్, ఉమర్, అనిల్, రఘుపతి, రమేష్, నర్సింలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking