గడప గడపకూ గ్యారెంటీ

 

ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం…

ఆపదలో అండగా ఉంటాం

ఖమ్మం రూరల్ మండల పర్యటనలో మంత్రి పొంగులేటి సతీమణి మాధురి

ఖమ్మం ప్రతినిధి మార్చి 21 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు గడప గడపకూ అందుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి పొంగులేటి మాధురి పేర్కొన్నారు. ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆదుకుంటామని… ఆపదలోనూ
తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడు, తెల్దారుపల్లి, మద్దులపల్లి, పొన్నేకల్, తల్లంపాడు, కొండాపురం, చింతపల్లి, అరెకోడు తండా, అరెకొడు, అరెంపుల, బారుగుడెం, గొల్లగూడెం తదితర గ్రామాలను గురువారం ఆమె సందర్శించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన న్యాయం చేకూర్చే బాధ్యత మంత్రి పొంగులేటి తీసుకుంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, నాగండ్ల శ్రీనివాసరావు, మద్ది కిషోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ తమ్మినేని నవీన్, ఏనుగు వెంకట్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మద్ది వీరారెడ్డి, కర్లపూడి భద్రకాళి , ఏటుకూరి సుధాకర్, మెండె వెంకటేష్ యాదవ్, ముత్యం కృష్ణ రావు, నల్లపునేని కౌశిక్, అంజయ్య, గురు నారాయణ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking