లోకల్‌ పత్రికల ఎడిటర్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ గారిని కోరిన కోర్‌ కమిటీ

హైదరాబాద్‌ప్రజాబలం ప్రతినిధి: చిన్న/లోకల్‌ పత్రికల ఎడిటర్లందరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ గారిని కోర్‌ కమిటీ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు గంట సేపు చిన్న పత్రికల సమస్యల గురించి మీడియా అకాడమీ చైర్మన్‌ గారికి వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న సమాచార శాఖలో ఎంపానెల్‌ అయినా అన్నీ పత్రికల ఎడిటర్లకు ప్రభుత్వ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరడం జరిగింది. చిన్న పత్రికలకు కొన్ని మినహాయింపులు ఇస్తూ, వాటిల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టు లందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరడం జరిగింది. చిన్న పత్రికల అప్‌ గ్రేడిరగ్‌ ప్రక్రియ జరగకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని అల్లం నారాయణ గారికి వివరించడం జరిగింది. వెంటనే అప్‌ గ్రేడిరగ్‌ చేయాలని కోరడం జరిగింది. యూనియన్లకు అతీతంగా చిన్న/లోకల్‌ పత్రికల ఎడిటర్లు ఏకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. చిన్న పత్రికల వారికి నిర్వహణ భారం పెరిగిన దృష్ట్యా అడ్వర్టైజ్మెంట్‌ నిధులు పెంచాలని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ గారిని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కోర్‌ కమిటీ సభ్యులు ఎండి యూసఫ్‌ బాబు, భీమగాని మహేష్‌ గౌడ్‌, మాతంగి దాస్‌ ఎ.శ్రీనివాస్‌ ,తాటికొండ కృష్ణ,వై.ఎల్‌.ఎచ్‌. అశోక్‌, డి.బాలకృష్ణ, అప్రోజ్‌ ఖురేషి, హుస్సేన్‌ ఎక్భాల్‌, ఎం.డి. మక్సూద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking