శాలివాహనులు(కుమ్మరి వారి) సమస్యలు వెంటనే పరిష్కరించాలి

 

సిద్దిపేట జిల్లా ప్రజాబలం ప్రతినిధి

దుబ్బాక మండల చౌదర్పల్లి గ్రామంలో పర్యటించిన కత్తి కార్తీక అనంతరం ఆమె మాట్లాడుతూ ,అనాధికా నిరక్షరాస్యత, పేదరికము గతంలో ఎవరు ఉద్యోగాలు చేసేవాళ్లు కానీ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కానీ వీళ్లదాంట్లో ఎవరు లేరు. చదువును మధ్యలోనే ఆపేసి చిన్నచిన్న కూలి పనులకు వెళ్లేవారు

వెనకటి తరంలో ఈ కుమ్మరి వారికి చేతినిండా పని ఉండేది, మట్టి పాత్రలకు గిరాకీ ఉండేది. అందరు మట్టి పాత్రలో వండుకొని మట్టి పాత్రలోనే భోజనాలు చేసేవారు
ఇప్పుడు ఈ స్టీల్ పాత్రలు వచ్చినటువంటి నుంచి ప్రజలందరూ ఈ స్టీల్, పాత్రలు మరియు ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఎక్కువగా వాడుతున్నారు
ఈ మట్టి పాత్రలు ఎక్కడో కనుమరుగైపోయాయి

ఈ కుమ్మరి వారికి కుండలు తయారు చేసే మిషన్లు ఏర్పాటు చేసి వీరికి చేతినిండా పని కల్పించాలి

ఈ కుమ్మరి వారి దగ్గర సంక్రాంతికి, ఉగాది, దీపావళి, పండుగలకు మనం ఎక్కువగా మట్టి పాత్రలు వాడుతుంటాం కాబట్టి విరు రకరకాల డిజైన్లు తో మనకు ప్రమిదలు గాని తయారుచేసి ఇస్తుంటారు కాబట్టి వీళ్లకు అలాంటి మిషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి వీరికి ఉపాధి కల్పిస్తే అందరూ మట్టి పాత్రలని ఎక్కువగా ఉపయోగిస్తారు

కులవృత్తిని నమ్ముకొని వీళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వీళ్లకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయాలి

శాలివాహనుల కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలి మరియు వీరికి ప్రభుత్వం ఎటువంటి రుణం లేకుండా సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం

విరు మట్టి పాత్రలు తయారు చేస్తారు కాబట్టి వర్షానికి అవి తడిసిపోయి పైన కప్పు లేనందున మట్టి పాత్రలన్నీ తడిసి ముద్దవుతాయి,వీల్లు పనిచేసేందుకు మిషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీళ్లకు ఉపాధి దొరుకుతుంది

వీళ్ళు కుండ పాత్రలు తయారు చేయడానికి స్థలం లేదు. ప్రతి ఒక్క కుమ్మరి వారికి షెడ్డును ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి

మట్టి కుండ పాత్రలకు గిరాకీ లేదు అందరూ మట్టి పాత్రలు వాడాలి మట్టి పాత్రలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది

శాలివాహనలు (కుమ్మరి బందు) 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం…

Leave A Reply

Your email address will not be published.

Breaking