బీజేపీ పాలనలో సామాన్యులకు భారం..కార్పొరేట్ కు వరం
గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే
దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో నినదించిన గులాబీ శ్రేణులు
గ్యాస్ ధరలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
సిద్దిపేట జిల్లా ప్రజాబలం ప్రతినిధి
2014లో అచ్చే దిన్ అంటూ అధికారంలోకి వొచ్చిన ప్రధాని నరేంద్రమోదీ నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ..సచ్చే దిన్ గా మార్చారని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేసారు..గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా దుబ్బాక పట్టణంలో బస్టాండ్ ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం.చేశారు… ఈసందర్భంగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ గారితో కలిసి..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు..మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు పెంచుతూ మహిళలకు కానుక ఇచ్చాడని ఆయన ఎద్దేవా చేశారు.. గ్యాస్ ధరలు పెంచడంతో వంట యాదికి వొస్తేనే..మహిళలకు కన్నీళ్లు వొస్తున్నాయని, కట్టెల పొయ్యే దిక్కవుతుందని ఆయన పేర్కొన్నారు.. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని, ఎరువుల. డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు చేసి అన్యాయం చేసాడన్నారు..తెలంగాణ ప్రభుత్వం సామాన్యుల హితమే ద్యేయం గా పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సింది పోయి..కొర్రీలు పెడుతుందన్నారు..బీజేపీ ప్రభుత్వం పేదలకు శాపంగా, కార్పొరేట్ వ్యవస్థకు వరంగా మారిందన్నారు.ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ..మేకిన్ ఇండియా విధానంకు చరమ గీతం పడుతున్నారన్నారు..మహిళలు తలుచుకుంటే కానిది లేదని, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ పాలనకు వొచ్చే ఎన్నికల్లో చరమ గీతం పాడాలన్నారు.. నోరు తెరిస్తే తెలంగాణ ప్రభుత్వం మీద అబద్దలతో విమర్శలు చేసే ఎమ్మెల్యే గ్యాస్ ధరల పెంపుపై స్పందించాలన్నారు..ఎన్నికల వేళ మీ గ్రామాల్లో రఘునందన్ ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు..
గ్యాస్ ధరను పెంచిన బిజెపి ని గద్దె దించేవరకు పోరాటం సాగించాలన్నారు..రూ.400 గ్యాస్ సిలిండర్ నేడు రూ. 1175 రూపాయలకు పెంచడం దారుణమన్నారు..

నల్లధనం తీసి..గరీబోల్ల ఖాతాల్లో వేస్తానని చెప్పిన మోదీ గారు..నేటికీ పైసా వేసింది లేదని, ఆధాని, అంబానీ లాంటి కార్పోరేట్ లకు కోట్లాది రూపాయలు కట్టబెట్టారన్నారు..
వేల కోట్ల విలువ చేసే ఆస్తులను మోడీ అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు..
దేశం మొత్తాన్ని. గుజరాత్ కంపెనీలకే అప్పజెప్పుతున్నారని ఆయన విమర్శించారు..
దేశంలో నీచ నికృష్టమైన పరిపాలన దేశంలో కొనసాగుతుందన్నారు..
గతంలో వాజ్పేయి పాలించిన బిజెపి నేడు కనుమరుగు అయిందని, మోదీ కార్పొరేట్ దౌర్భాగ్య పాలన సాగుతుందన్నారు..
జాతీయ స్థాయిలో బిజెపి ని గద్దె దించేందుకే బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 6 మాసాల్లో రాజీనామా చేస్తా అన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎటు పోయాడని, ఇంకా 6 మాసాలు పూర్తి కాలేవా అని ఆయన ప్రశ్నించారు. ..
జూటా మాటలతో, అబద్ధాలతో గద్దెనెక్కన రఘునందన్ ను ఊర్లల్లో అడుగడుగునా నిలదీయాలన్నారు..