హైదరాబాద్ మార్చ్ 2;జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను జియాగూడ, పురానాపూల్ పరిసరాల్లోని పలు విద్యా సంస్థల్లో పోటాపోటీగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు స్కూళ్లలో సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

* జియాగూడ కేటీఎస్ స్కూల్లో..
జియాగూడలోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్లో ప్రిన్సిపల్ శ్రీనివాస్ సైన్స్ ప్రదర్శన ప్రారంభించారు. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శనలో పాల్గొని శాస్త్ర సాంకేతిక, పర్యావరణం తదితర అంశాలపై పలు నమూనాలు ప్రదర్శించారు.
* ఇంద్రాణి మహావిద్యాలయలో
డోర్బస్తీలోని ఇంద్రాణి మహావిద్యాలయ స్కూల్లో ఏర్పాటు చేసిన ఐ ఎం. ఎస్. మేధా మంథన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మేళ- 2023ను స్థానిక జియాగూడ బీజేపీ కార్పొరేటర్ బోహిని దర్శన్, తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అసిఫ్ నగర్ మండల అధ్యక్షుడు బి. గాలయ్య, తెలుగుదేశం పార్టీ జియాగూడ అధ్యక్షుడు కె.నర్సింగ్గారావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ మిథిలేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆర్ట్స్, సైన్స్ అంశాలలో పలు నమూనాలను ప్రదర్శించడంతో పాటు సాంఘిక జానపద, పౌరాణిక అంశాలలో వేషాలు ధరించి నాటికలు ప్రదర్శించి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

రహీంపురా క్రిష్ణవేణి ట్యాలెంట్ స్కూల్లో
పురానాపూల్ (రహీంపురా) కేటీఎస్ స్కూల్లో విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠ్యాంశాలనే ప్రాక్టికల్ నమూనాలుగా రూపొందించి ప్రదర్శించడం విశేషం. ఈ ప్రదర్శనను స్కూల్ ప్రిన్సిపల్ బెన్ని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలను తిలకించేందుకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు క్యూలు కట్టడంతో పాఠశాలల్లో సందడి వాతావరణం కనిపించింది.