మంచిర్యాల జిల్లా బంద్ కు పిలుపు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 01 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు అనగా గురువారం మంచిర్యాల జిల్లా బంద్ కు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు.బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేఖ మాట్లాడుతూ…. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లోని గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా రైతులు ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఈ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కొక్కిరాల సురేఖ కోరారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అద్యక్షులు తూముల నరేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్యా,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు,కౌన్సిలర్ రామగిరి బాణేష్, యువజన కాంగ్రెస్ నియోజక వర్గ అద్యక్షులు సల్ల మహేష్, ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు వడ్డే రాజమౌళి,గాండ్ల సత్తమ్మ,పుట్ట లావణ్య,లలిత, డిసిసి డెలిగేట్ ఆది సంజీవ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్,ఎంపీటీసీ లు బాలరాజు,డేగ బాపు,తూముల వెంకటేష్,పుదరి ప్రభాకర్,బోల్లం భీమయ్య,పెంట రమేష్,చింతకింది మల్లయ్య,గట్టు స్వామి,భీమాగౌడ్, సంతోష్,శంకర్,రాజన్న,వెంకటేష్, అజయ్,ప్రకాష్,రఫీ,రమేష్, తిరుపతి,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.