పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రివర్యులు 20 వేల జనాలతో భారీ బహిరంగ సభ
ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. అధికార సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ బాదావత్ సంతోష్
రామగుండం కమిషనర్ రేమా రాజేశ్వరి ఐపీఎస్.
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 01 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే బాల్క సుమన్ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమై మార్చి 15 న మంత్రి పర్యటన వివరాలను తెలియజేస్తూ..అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ….. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు వివరించడం అయినది అందులో.
జోడు వాగుల వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అర్బన్ ఎకో పార్క్ ప్రారంభోత్సవం 2.50 కోట్ల రూపాయలతో నిర్మించిన కేసీఆర్ పార్క్ ప్రారంభం,చెన్నూరు పట్టణంలో 25 కోట్లతో జలాల్ పెట్రోల్ బంక్ నుండి అంబేద్కర్ చౌక్ కొరకు నూతనంగా నిర్మించిన నాలుగు లైన్ల ప్రధాన రహదారి సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం,
9 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్,కుమ్మరి కుంట మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం, కానున్నదని
చెన్నూరు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ దవాఖానకు శంకుస్థాపన,ఎమ్ సి ఎచ్ పనుల పర్యవేక్షణ,5 కోట్ల రూపాయలతో చెన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన మినీ స్టేడియం ప్రారంభోత్సవం,చెన్నూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బస్సు డిపోకు శంకుస్థాపన,చేయనున్నారు
చెన్నూరు పట్టణంలో1.50 కోట్ల రూపాయలతో నిధులతో నూతనంగా నిర్మించనున్న సమ్మక్క సారలమ్మ మహిళా భవన్ మరియు చెన్నూరు నియోజకవర్గంలో తొలి విడతలో భాగంగా నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ మహిళా భవన్ లకు శంకుస్థాపన,తదనంతరం చెన్నూరు పట్టణంలో నిర్వహించే సభలో నూతనంగా నియమింపబడిన మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది.
ఇదే వేదిక పైన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు,అభయహస్తం నిధులు,తునికాకు కార్మికులకు సంబంధించిన నిధులను మంత్రి.చేతుల మీదుగా అందించనున్నారు.పలు అభివృద్ధి,శంకుస్థాపన కొరకు మంత్రి. అధికారికంగా పర్యటిస్తున్న సందర్భంగా పర్యటన ఆద్యంతం పండగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. చెన్నూరు పట్టణంతో పాటు ఇందారం,కిష్టంపేట గ్రామాలు, జైపూర్,భీమారం మండల కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.సభకి సుమారు 20 వేలకు పైగా ప్రజలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.సభ ప్రాంగణంలో త్రాగునీరు, టెంట్లు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సభానంతరం సుమారు 25 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్,అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్,అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) రాహుల్ , రామగుండం సీపీ రెమా రాజేశ్వరి,డి ఆర్ డి ఓ శేషాద్రి , ఎఫ్ డిఓ రమేష్,మున్సిపల్ కమిషనర్ గంగాధర్,ఎమ్మార్వో శ్రీనివాస్ దేశ్ పాండే,ఈఈ ఇరిగేషన్ స్వామి, ఈఈ పిఆర్ ప్రకాష్, టిఎస్ఎమ్ఎస్ఐడిసి డిఈ ఏసిపి నరేందర్,డిఎమ్ ఆర్ టి సి సూపర్ డెంట్లు అరవింద్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు