అజ్ఞానాన్ని పారద్రోలే ఏకైక ఆయుధం విద్య గరికపాటి

ఎస్ బి ఐ టి లో ఘనంగా ఓరియన్టేషన్ ప్రోగ్రాం
ఆలోచింపచేసిన గరికపాటి సలహాలు సూచనలు

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం గురువులను, తల్లిదండ్రులను గౌరవించటం విద్యార్థులు అలవరుచుకోవాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహాసహస్ర అవధాని గరికపాటి నరసింహారావు తెలిపారు. గురువారం స్థానిక యస్.బి.ఐ.టి. కళాశాలలో నిర్వహించిన మొదటి సంవత్సర విద్యార్థుల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో విశిష్ట అతిధిగా పాల్గొన్న గరికపాటి తల్లిదండ్రులు మరియు గురువుల ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అవగాహాన కలిగించారు. విద్యార్థులు ఫోన్లు, టెలివిజన్ వంటి వ్యాపకాలు మాని వారంలో 2 రోజులు డిజిటల్ ఉపవాసం అలవర్చుకోవడం ద్వారా విద్యపై దృష్టిని కేంద్రీకరించగలమని వెల్లడించారు. మోయలేని భారం వల్లనే ఒత్తిడి పెరుగుతుందన్నారు. గురువులతో చర్చించడంతో ఎలాంటి ఒత్తిడినైనా జయించవచ్చని వారు తెలిపారు. విధ్యను అభ్యసిస్తూనే దేశ అభివృద్ధి గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గరికపాటి విద్యార్థులతో ముఖాముఖి చర్చించి వారితో ప్రశ్నోత్తరాలలో పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ యస్.బి.ఐ.టి. లో ఉన్నత మైన విద్యా ప్రమాణాలు పాటించటంతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించటంలో నిర్విరామంగా కృషి చేస్తున్నామని, ఇటీవల కళాశాల పొందిన న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ మరియు యు.జి.సి అటానమస్ హెూదా దీనికి నిదర్శనం అని, ఈ విద్యా సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100 శాతం అడ్మిషన్లు కలిగిన కళాశాల గా నిలవటం ఎంతో గర్హనీయమని ఇది మా కళాశాలపై భాధ్యతను పెంచిందని, తల్లిదండ్రుల నమ్మకానికి అనుగుణంగా విద్యార్థులు అభివృద్ధి చేందేందుకు తాము సాయశక్తుల కృషి చేస్తామని వెల్లడించారు మన దేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేస్తుండగా కేవలం 1.5 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని మిగిలిన వారు నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారని ఈ పరిణామాలకు అనుగుణంగా మా విద్యార్థులకు కోడింగ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలగు శిక్షణా కార్యక్రమాలను, ఇంటర్న్షిప్స్, ఫస్ట్ ఇయర్ నుంచే నిర్వహిస్తున్నామని తద్వార బహుళజాతి కంపెనీలలో అత్యధిక ప్లేస్మెంట్స్ను ఏర్పాటు చేస్తున్నామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి విశ్లేషించారు. విద్యార్థులు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక విప్లవమైన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ మొదలగు రంగాలలో ఆసక్తిని పెంచుకొని నైపుణ్యాలను పెంచుకోవటంలో ధృడ సంకల్పం కలిగి ఉండాలని కళాశాల ప్రిన్సిపల్ డా జి. రాజ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల తో పాటు కళాశాలవైస్ ప్రిన్సిపల్ డా కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా జె. రవీంద్రబాబు, యన్. శ్రీనివాసరావు, హెచ్.ఒ.డిలు, డా కె. స్పూర్తి, డా చరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking