ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఓపిఎస్ విధానానికి కట్టుబడి ఉన్నాము

ఎస్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, జనవరి 7: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తనవంతు కృషి తప్పక ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరభవన్ లో ఎస్టీయు క్యాలెండర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ బోధకులను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తే పూర్తిస్తాయిలో విద్య అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయ, ఉద్యోగులు కీలకపాత్ర పోషించారన్నారు. పడేండ్ల కాలంలోనే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ టు పిజి విద్య కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. క్రమబద్దీకరణ పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు దారులు తీశారన్నారు. నిరుపేద వర్గాలు గత్యంతరం లేక ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సి వస్తోందన్నారు. బోధన సిబ్బందిని నియమించి ప్రతి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేస్తామని జీవన్ రెడ్డి అన్నారు. మెగా డిఎస్సి ని నిర్వహించెందుకు సిఎం రేవంత్ రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. భోదనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్నామ్నాయంగా విద్యా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పదోన్నతి అనేది నిరంతర ప్రక్రియ అని ఎం.ఈ. వోలు, డీ ఈ వోలు లేక విద్యా వ్యవస్థ అదనపు బాధ్యతలతో కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో ఉద్యోగుల విరమణ సమయానికే ఉద్యోగాలను అక్కడి ప్రభుత్వం భర్తీ చేస్తోందన్నారు. 317 జీవో పై శాసన మండలిలో చర్చకు లేవనెత్తినట్లు, ఉమ్మడి జిల్లాను ఒక జోన్ గా గుర్తించాలని సూచించినట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వం ఓపిఎస్ విధానానికి కట్టుబడి ఉందని చెప్పారు. పదోన్నతులకు, ఖాళీల భర్తీకి పూర్తి బాధ్యత వహిస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా అధ్యక్షులు మచ్చ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరం హరికిరణ్, రాష్ట్ర కార్యదర్శి రవీందర్, బాలకృష్ణ,
కచ్చు రాజన్న, పాలపు శివరామకృష్ణ , మేకల ప్రవీణ్ , సిరిపురం రాజేష్, వివిధ మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయికుమార్ , మహేష్ , సురేష్ , శ్రీనివాస్, కృష్ణ, వెంకటేష్, రాజశేఖర్, నరేష్ , మురళి, దశరత్ రెడ్డి, రాజేష్ , పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking