బీ ఎల్ ఓ అందుబాటులో ఉండాలి
తహసీల్దార్ రాఘవేంద్ర రావు
ఎన్నికల విధులను పగడ్బందిగా నిర్వహించాలని,బీ ఎల్ ఓ లు అందుబాటులో ఉండాలని తహసీల్దార్ రాఘవేంద్ర రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల పరిషత్ మీటింగ్ హాల్ లో మండల స్థాయి ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇప్పటికే ప్రచురించిన వోటర్ లిస్టులను క్షుణ్ణంగా పరిశీలించి ఎవరివైనా పేర్లు నమోదు కాకుండా ఉంటే వెంటనే నమోదు చేయాలన్నారు.ఎన్నికల రోజున ఓటర్లుకు నీడ కొరకు టెంట్ వేయాలన్నారు. ఓటర్లకు మంచి నీటి సదుపాయం కల్పించాలని, ప్రతి పోలింగ్ బూతు వద్ద మెడికల్ టీమ్ ఉండాలన్నారు.బీ ఎల్ ఓ లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహకరించలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచి నీటి వసతి,నీడ కొరకు టెంట్లను స్తానిక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలన్నారు.బీ ఎల్ ఓ లు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలన్నారు.ప్రతి బూత్ వద్ద కావలసిన సామానులు అన్ని అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృధి అధికారిణి సరోజ,హాజీపూర్ ఎంపిడిఓ మధుసూదన్,ఇరిగేషన్ డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ చైతన్య,మనిక్ రావు,ఏ ఈ గౌతం, మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజ శేఖర్,రామ్ మోహన్, అతీష్ కుమార్,సూపర్ వైజర్లు సమ్మక్క, నవీత్,జీవన్ రెడ్డి,బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.