వాహ్ హరీస్, హలీమ్…

 

రంజాన్ మాసంలో హరీస్, హలీమ్ లకు పెరిగిన గిరాకీ

రుచిలో టాప్ ఖమ్మం దావత్ రెస్టారెంట్ హరీస్ హలీమ్ విక్రయ కేంద్రాలు

చికెన్ తో హరీస్.. మటన్ తో…(యాటపోతు) హలీమ్

ఖమ్మం ప్రతినిధి మార్చి 26 (ప్రజాబలం) ఖమ్మం భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా దావత్ రెస్టారెంట్ ను ఖమ్మం జిల్లా కేంద్రంలో 2016 లో మహమ్మద్ ముజాహిద్ ఖాన్ స్థాపించారు.. భోజన ప్రియులకు హైదరాబాద్ వంటకాలను, అరేబియన్ మండి వంటకాలను ఖమ్మం జిల్లాకు తొలిసారిగా పరిచయం చేసింది ఖమ్మం దావత్ రెస్టారెంట్ అని చెప్పవచ్చు… అయితే పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదర సోదరీమణులు 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహిస్తూవస్తుంటారు.. ఈక్రమంలో సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ అనంతరం హరీస్, హాలీమ్ వంటకాలు ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.. వీటిని భుజించడం ఆరోగ్య ప్రధాయినిగా హరిస్, హలీంలు నిలిచాయని చెప్పవచ్చు.. కాగా ఇందులో చికెన్ మరియు మటన్ తో మాంసాహార కృతులతో జీడిపప్పుపేస్ట్. స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన గేదేపాలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, బలవర్ధకమైన హరీస్ హలీంలను ఖమ్మం నగరానికి గత 8 సంవత్సరాల క్రితమే పరిచయం చేసింది కేవలం దావత్ రెస్టారెంట్ నిర్వాహకులే అని చెప్పవచ్చు..ఖమ్మంలో షాగోస్ పిస్తా హౌస్ హలిమ్ ను భుజించాలనుకుంటే దావత్ రెస్టారెంట్ వండిన వంటకo భుజిస్తే ఎక్కడాదొరకని టేస్ట్ ఇట్టే తెలిసిపోతుంది..ఎక్కడ లభించని ఎక్కడ దొరకని రుచికరమైన ఆహార పదార్థాలు హరీస్, హలీమ్ మరియు బిర్యానీ వంటకాలు కూడా ఇక్కడ మహా అద్భుతంగా ఉన్నాయని నగర ప్రజలు పేర్కొంటున్నారు హోటల్ రంగంలో ఖమ్మం జిల్లా కూడా మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసుపోకుండా వెలసిల్లుతుంది… అయితే హరిస్ , హలీమ్ విక్రయ కేంద్రాలు ఖమ్మంలో అనేకంగా ఉన్నప్పటికీ.. దావత్ రెస్టారెంట్ కు చెందిన ఏడు కేంద్రాలు ఒక ప్రత్యేకతను చాటు కుంటున్నాయి. ఈ హరిస్, హలీమ్ వంటకoతో పాటు బోన్ సూప్ తో హరిస్, హలింలను వినియోదారులకు అందించడంతో ముస్లిం సోదరులతో పాటు ముస్లిమేతర ప్రజలు కూడా వీటిని భుజించేందుకు ఉత్సుకత చూపుతున్నారు

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ నిత్యం ప్రార్థనలు చేస్తూఉంటారు రంజాన్ మాసం అంటే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది హలీమ్. ముస్లిం వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా భుజిస్తారు ఈసమయంలో ఎక్కడ చూసినా హలీమ్ సెంటర్స్ కనిపించేస్తాయి. నోరూరించే హలీమ్ చిన్న పెద్ద అందరూ ఎంతో ఇష్టంగా భుజిస్తారు.. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోల్పోయిన శక్తిని హలీమ్ తింటే తిరిగి పొందవచ్చు

ఒక్కో దేశంలో ఒక్కోలా

హలీమ్ ని ఒక్కక్కరూ ఒక్కో పేరుతో పిలుస్తారు. అరేబియన్లు, ఆర్మేనియా వాళ్ళు ‘హరీస్’ అంటారు. టర్కీ, ఇరాన్, అజర్ బైజాన్, ఇరాక్ లో హలీమ్ ని ‘దాలీమ్’ అని అంటారు. పాకిస్థాన్ లో ‘కిచర’ అని పిలుస్తారు

హలీమ్ అంటే ఏంటి…?

మటన్ తో హలీమ్ తయారు చేస్తారు. చూసేందుకు పేస్ట్ లాగా మెత్తగా ఉంటుంది.ఇందులో ఉపయోగించే పదార్థా లన్నింటి లోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమలు నెయ్యి,అల్లం, వెల్లుల్లి, పేస్ట్, పసుపు, శనగపప్పు, మినపప్పు, వేస్తారు. ఇవే కాదు* *మసాలాకోసం ధనియాలు, జీలకర్ర, వాము, దాల్చినన చెక్క, యాలకులు, లవంగాలు,నల్ల మిరియాలు, కుంకుమ పువ్వు,బెల్లంతో పాటు డ్రై ఫ్రూట్స్ పిస్తా, జీడిపప్పు, అంజీరా, బాదం పప్పు వేస్తారు.గ్రేవీగా ఉండే వేడి వేడి హలీమ్ చూస్తే.. ఎవరికైనా నోరూరిపోతుంది. దాని మీద కొత్తిమీర, ఫ్రైడ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ, ముక్క వేసి గార్నిష్ చేసి ఇస్తారు

ఎలా చేస్తారు?

హలీమ్ చేసేందుకు ఎక్కువ సమయంపడుతుంది గోధుమలు పప్పులు రాత్రంతా నానబెట్టి బాగా ఉడికించుకుని
పెట్టుకోవాలి మటన్ కూడా ఖైమా లాగాచేసుకుని ఉడికించుకోవాలి అన్ని రకాలమసాలాలు వేసిన తర్వాత గ్రేవీ మాదిరిగా ఎక్కువగా ఉడికిస్తే రుచిఅంతఅద్భుతంగా ఉంటుంది. సన్నని మంట
మీద ఉడికించడం వల్ల హలీమ్ వండటానికి కనీసం 6-7 గంటల సమయం పడుతుంది

హలీమ్ ఆరోగ్యకరమేనా?

కేలరీలు అధికంగా ఉండే హలీమ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తక్షణమే శరీరానికి శక్తినిస్తుంది. ఇందులోని పీచు పదార్థం కారణంగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉండటం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి మటన్ డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం గోధుమలు ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది…దీని తయారీకి ఉపయోగించే మసాలా దినుసుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధు మేహంతో బాధపడే వారికి చక్కని ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking