దేశ ప్రజలు నరేంద్ర మోదీని ప్రధాని మంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 26 :దేశ ప్రజలు నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని పెద్దపల్లి బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ అన్నారు.మంగళవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం భాగంగా పెద్దపల్లి ఎంపీ గా బీజేపీ నుండి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు.లక్షెట్టిపేట పట్టణంలోని బస్ స్టాండ్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు అయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటేనన్నారు.కేంద్రంలో మూడోసారి వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని,దేశ ప్రజలు మోదీని మరొకసారి ప్రధాన మంత్రిని చేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు.పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా బీజేపీ అభ్యర్దిని గెలిపించి పార్లమెంట్ కు పంపాలని కోరారు.అయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్,పట్టణ అధ్యక్షుడు హరిగోపాల్, లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు బొప్పు కిషన్,సీనియర్ నాయకుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి,మోటపలుకుల గురువయ్య, కర్రె లచ్చన్న,శ్రీనివాస్,గోపతి రాజన్న,మధు,వేణు రాకేష్,కిషన్ బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.