రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 25 మార్చ్ 2024: బీ.ఆర్.ఎస్ పార్టీ అధినేత కే సీ ఆర్ ఆదేశానుసారం మంగళ వారం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక ప్రక్రియ నార్సింగి ఓం కన్వెన్షన్ లో స్థానిక రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు టీ.ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన రాజేద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణీ దేవి, యెగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ గుప్తా, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు తది తరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకం అయిన ఒక మంచి వ్యక్తి అని, జడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవ చేశారని, బడుగు బలహీన వర్గాల గొంతుకగా జ్ఞానేశ్వర్ తన వాణి పార్లమెంట్ లో వినిపించేలా చేద్దాం అని అన్నారు, 96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరి ఐక్యతకు పాటు పడ్డారని కొనియాడారు. నేడు రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోతే నాడు ఈ ప్రాంత ప్రజలకు తెలియని రంజిత్ రెడ్డిని కేసీఆర్ చెప్పారని బీ.ఆర్.ఎస్ కార్యకర్తలు ఐఖ్యతతో ముందుండి ఎంపీగా గెలిపించడం జరిగినదని కాని అట్టి ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు కష్ట కాలంలో విశ్వాసం లేకుండా పార్టీని వదిలి వెళ్లారని ఎద్దేవా చేస్తూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పర్యవసానంగా ఈ ఎన్నికలలో చిత్తుగా ఓడిస్తు, తాము చేస్తున్న సేవలను గుర్తించి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను అఖండ మెజారిటీతో పార్లమెంట్ కు పంపడం తధ్యమని ఢంకా పథంగా చెప్పినారు.