బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే 20 సంవత్సరాల సేవలు శూన్యం

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి

పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్

బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గా పని చేసిన నడిపెల్లి దివాకర్ రావు 20 సంవత్సరాల సేవలు శూన్యం అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ అన్నారు.మంగళవారం ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ లు మాట్లాడుతూ…కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విజయానికి కారణభూతమయ్యాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 20 యేండ్లు ఏమ్మెల్యే పదవి అనుభవించి ప్రజలకు చేసిన సేవలు శూన్యమని విమర్శించారు.స్వార్ధం తప్ప ప్రజాపలన పై దివాకర్ రావు కు ఎప్పుడు ప్రేమ లేదని ధ్వజమెత్తారు.అభివృద్ధి, సంక్షేమం ను విస్మరించడం వల్లనే దివాకర్ రావును ప్రజలు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు.ప్రజల కు ప్రేమ పాత్రుడైన ప్రేమ్ సాగర్ రావును ఎమ్మెల్యే గా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన వంద రోజుల్లోనే నియోజవర్గంకు 200 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చిన ఘనత ప్రేమ్ సాగర్ రావుకు దక్కిందన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక సమస్యలను పరిష్కరించడానికి ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారన్నారు.ప్రేమ్ సాగర్ రావు సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు.ఔ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking