-సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కంబాల, దాసరి
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 17:
ఆది జాంబవ సంఘం నూతన అధ్యక్షులుగా కంబాల రాజనర్సు, ప్రధాన కార్యదర్శిగా దాసరి రాజనర్సు లను ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీదునూరి శంకర్, ఉపాధ్యక్షులుగా ఆవునూరి పోశం, బచ్చలి భీమయ్య, తుంగపిండి శ్రీనివాస్, కల్వల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా కల్వల పోషం, రామ్ బాబు, విరుగురాల వెంకటి, దాసరి ఎల్లారం, గసిగంటి మల్లయ్య, నాయిని శ్రీను, అధికార ప్రతినిధిగా ఉప్పులేటి నరేష్, ప్రచార కార్యదర్శులుగా సంఘీ రవి, రేగుంట రాజన్న, నెరువట్ల లక్ష్మణ్, ఏల్పుల దుర్గ ప్రసాద్, కాసిపేట సుధాకర్, గసిగంటి శంకర్, కోశాధికారిగా ఆసం కొమురయ్య, కార్యవర్గ సభ్యులుగా కల్వల సురేష్, కాసిపాక తిరుపతి, హనుమంతు, ఏల్పుల కిరణ్, ఎల్పుల వెంకటి, అంతర్పుల మధు లను ఎన్నుకున్నారు.